AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: కన్యాదానం చేయనంటూ హాన్సిక తల్లి నిర్ణయం.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..

తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో పెళ్లికి ముందుకు హన్సిక కుటుంబంలో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమం, వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్ వంటివి చూపించారు. అలాగే కన్యాదానం విషయంలో తన తల్లి తీసుకున్న నిర్ణయానికి హన్సిక భావోద్వేగానికి గురయ్యింది.

Hansika Motwani: కన్యాదానం చేయనంటూ హాన్సిక తల్లి నిర్ణయం.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..
Hansika
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2023 | 3:14 PM

Share

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ హన్సిక. తెలుగులో వరుసగా హీట్ చిత్రాల్లో నటించి భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాదు. ఓటీటీలోనూ వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న హన్సిక.. గతేడాది తన ప్రియుడు సోహైల్ కతురియాతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లో మూడు రోజులపాటు జరిగిన వీరి పెళ్లి వేడుకలకు ఇరువురి కుటుంబసభ్యులు.. అతి తక్కువ మంది సినీ ప్రముఖులు హజరయ్యారు. వీరికి పెళ్లికి సంబంధించిన వేడుకలను లవ్ షాదీ డ్రామా పేరుతో హాట్ స్టార్ రెండు వారాల నుంచి ప్రసారం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో పెళ్లికి ముందుకు హన్సిక కుటుంబంలో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమం, వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్ వంటివి చూపించారు. అలాగే కన్యాదానం విషయంలో తన తల్లి తీసుకున్న నిర్ణయానికి హన్సిక భావోద్వేగానికి గురయ్యింది.

తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని తన కుమార్తెకు వివరిస్తూ కనిపించారు హన్సిక తల్లి. “కుటుంబంలో అందరికంటే నాకు నువ్వే ఎక్కువ. ప్రతి అమ్మాయికీ ఆత్మ గౌరవం ఎంతో ముఖ్యం. నీవల్లే అది నాకు మరింత పెరిగింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఇబ్బందులు ఎదుర్కొని.. విమర్శలు దాటుకుని.. ఈ స్థాయికి వచ్చావు. పెళ్లి విషయంలో నేను కన్యాదానం చేయకూడదని ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే దానం చేయడానికి నువ్వు వస్తువు కాదు. మరొకరికి నిన్ను దానం చేయడానికి. కన్యాదానానికి బదులు గోదానం చేస్తాను. అలాగే పెళ్లి అయినా సరే నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కుమార్తెవే” అంటూ తన తల్లి చెప్పడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది హన్సిక. తన తల్లి తీసుకున్న నిర్ణయం తనకు చాలా నచ్చిందని.. అది చాలా గొప్ప విషయమని అన్నారు హన్సిక.

ఇవి కూడా చదవండి

హన్సిక భర్త్ సోహైల్ కు గతంలో ఆమె స్నేహితురాలు రింకీ బజాజ్ తో వివాహం జరిగింది. పెళ్లైనా కొద్ది కాలానికే వీరిద్దరు విడిపోయారు.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?