AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayasudha: ‘అలా చేసినందుకు విశ్వనాథ్ గారికి నాపై కోపం.. చాలా రోజులు మాట్లాడలేదు’.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు..

సాగర సంగమం సినిమా కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడంతో విశ్వనాధ్ తనపై సీరియస్ అయ్యారని.. ఆ కారణంగానే ఆయన తనతో చాలా రోజులు మాట్లాడలేదని అన్నారు.

Jayasudha: 'అలా చేసినందుకు విశ్వనాథ్ గారికి నాపై కోపం.. చాలా రోజులు మాట్లాడలేదు'.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు..
Jayasudha, Vishwanadh
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2023 | 9:43 AM

Share

ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దిగ్గజ దర్శకులు కళాతపస్వి కె. విశ్వనాధ్, సింగర్ వాణి జయరాం, నటుడు తారకరత్న మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఫిబ్రవరి 19న డైరెక్టర్ విశ్వనాధ్ జయంతి కావడంతో ఆయనను స్మరించుకుంటూ కళాతపస్వికి కళాంజలి అనే పేరుతో హైదరాబాద్‏లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితోపాటు.. పలువురు సినీ ప్రముఖులు… నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ.. సాగర సంగమం సినిమా కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడంతో విశ్వనాధ్ తనపై సీరియస్ అయ్యారని.. ఆ కారణంగానే ఆయన తనతో చాలా రోజులు మాట్లాడలేదని అన్నారు.

జయసుధ మాట్లాడుతూ.. “ఎంతో మంది హీరోయిన్స్ విశ్వనాధ్ గారితో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ జయసుధ ఎందుకు చేయలేదు అని మీ అందరికీ అనిపించి ఉంటుంది. విశ్వనాధ్ గారు తీసిన కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్ సినిమాలను నేను చేశాను. అలాగే సాగర సంగమం సినిమా నేను చేయాల్సింది. ఏడిద నాగేశ్వర రావు గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కమల్ హాసన్ గారు బిజీగా ఉండడం వలన ఆ సినిమా ఆలస్యమైంది. అదే సమయంలో ఎన్టీఆర్ గారితో నేను ఓ సినిమా చేయాల్సి వచ్చింది. దీంతో డేట్స్ కుదరలేదు.

సాగర సంగమం సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను. దాంతో విశ్వనాధ్ గారు నాపై ఏఅలిగారు. చాలా రోజులు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత నాతో ఆయన ఈ సినిమాలు తీయలేదు. నిజం చెప్పాలంటే సాగర సంగమంలోని ఆ పాత్రకు జయప్రదనే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆయన యాక్టర్ అయిన తర్వాత నాకు ఒక కథను చెప్పి తనతో నటించమని అడిగారు. చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.