Taraka Ratna: జూనియర్ ఎన్టీఆర్ గురించి తారకరత్న మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.. చివరి మాటలు ఇవే…

ఈ క్రమంలోనే తారకరత్నకు సంబంధించిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నందమూరి అభిమానులు.

Taraka Ratna: జూనియర్ ఎన్టీఆర్ గురించి తారకరత్న మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.. చివరి మాటలు ఇవే...
Taraka Ratna, Ntr Jr
Follow us

|

Updated on: Feb 20, 2023 | 8:46 AM

నందమూరి తారకరత్న మృతి చిత్ర సీమలో విషాదం నింపింది. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ.. శివరాత్రి రోజే శివైక్యం చెందారు. ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెలబ్రెటీలు.. ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి.. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నకు సంబంధించిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నందమూరి అభిమానులు.

“పదవి ఏముంది.. పార్టీయే మాది.. ఎప్పటికీ ప్రజల కోసమే మా పోరాటం.. పోరాడుతూనే ఉంటాం. సామాన్యుడిగా పోరాడాను… నాయకుడిగా కూడా పోరాడతాను. ఎన్టీఆర్ నా తమ్ముడే కదా.. జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు.. ప్రేమగా చూడాలి అనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ.. నందమూరి రక్తం. నా తమ్ముడు ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడే.. అన్నకి తమ్ముడిపై ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

కొద్ది రోజుల క్రితం టీడీపీ పార్టీలో చేరి.. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుప్పం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమంగా మారడంతో బెంగుళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న రాత్రి తుదిశ్వాస విడిచారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?