Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న రౌడీ.. ఆ వంద మంది అభిమానులకు మౌంటెన్ ట్రిప్..

తాజాగా తన అభిమానులను మౌంటెన్ ట్రిప్ పంపిస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న రౌడీ.. ఆ వంద మంది అభిమానులకు మౌంటెన్ ట్రిప్..
Vijay Deverakonda
Follow us

|

Updated on: Feb 19, 2023 | 3:50 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతేడాది క్రిస్మస్ సందర్భంగా వంది మంది అభిమానులను తన సొంత ఖర్చులతో ఉచితంగా మనాలీ ట్రిప్ ఏర్పాటు చేస్తున్నట్లు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల క్రితం విజయ్ దేవరశాంటా పేరుతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో తన ఫ్యాన్స్ కోసం ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈసారి 100 మందిని మనాలికి ఫ్రీగా వెకేషన్ ఏర్పాటు చేశారు. వారికి ఐదు రోజులపాటు ఫుడ్, ట్రావెలింగ్, ఫెసిలిటీతోపాటు.. అన్ని ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. తాజాగా తన అభిమానులను మౌంటెన్ ట్రిప్ పంపిస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ చాలా సంతోషంగా ఉందని అన్నారు.

“వారు నాకు ఉదయం విమానం నుంచి ఈ స్పెషల్ వీడియోను పంపించారు. హాలీడే సెలబ్రెట్ చేసుకునేందుకు వారంతా సిద్ధమయ్యారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ వీడియో షేర్ చేశారు విజయ్.

ఇవి కూడా చదవండి

దేవరశాంటా పేరుతో మొదటి సంవత్సరం హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అభిమానుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోను తను ఫాలో అవుతున్న 50 మంది అభిమానులను సెలక్ట్ చేసి వారికి స్పెషల్ గిఫ్ట్ పంపిణి చేశారు విజ్. ఆ తర్వాతి ఏడాది దేవరశాంటా అనే హ్యాష్ ట్యాగ్ పై కామెంట్ చేసిన 10 మంది కోరికలను నెరవేర్చారు. ఇక ఆ తర్వాత 100 మందికి క్రిస్మస్ కానుకగా రూ. 10 వేలు అందచేశారు. ప్రస్తుతం విజయ్ ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..