Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్.. స్పిరిట్ మూవీపై మరింత హైప్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్.. స్పిరిట్ మూవీపై మరింత హైప్..
Spirit
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2023 | 7:05 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. సలార్.. ప్రాజెక్ట్ కె.. డైరెక్టర్ మారుతీ కాంబోలో రాబోతున్న మరో ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటివరకు సెట్స్ పైకిరాని చిత్రాలు కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. అందులో ఒకటి స్పిరిట్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

2017లో అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా యానిమల్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభాస్.. స్పిరిట్ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ప్రస్తుతం రూపొందిస్తున్న యానిమల్ సినిమా తర్వాత ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుందని.. ఈ సినిమా అందరి అంచనాలు అందుకుంటుందని తెలిపారు. అలాగే ప్రభాస్ కెరీర్ 25 సినిమాగా రాబోతున్న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లె తెరకెక్కనుందని అన్నారు. దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.