AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘ఆ విషయం మీకు ఎప్పటికీ తెలియదు’.. సమంత ఎమోషనల్ పోస్ట్..

అలాగే తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సైతం తన ఫోటోస్.. వీడియోస్ ద్వారా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రేమికుల రోజున ఆసక్తికర పోస్ట్ చేసిన సామ్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.

Samantha: 'ఆ విషయం మీకు ఎప్పటికీ తెలియదు'.. సమంత ఎమోషనల్ పోస్ట్..
Samantha 1
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 16, 2023 | 6:18 PM

Share

కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న అగ్రకథానాయిక సమంత.. ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తోన్న సిటాడెల్ సిరీస్‏ చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే మరికొన్ని రోజుల్లో రౌడీ విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న ఖుషి షూటింగ్‍లోనూ పాల్గొననుంది. అయితే ఓవైపు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సామ్.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ.. తనను తాను మరింత బలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సైతం తన ఫోటోస్.. వీడియోస్ ద్వారా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రేమికుల రోజున ఆసక్తికర పోస్ట్ చేసిన సామ్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.

” జీవితంలో ఎవరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో మీకు ఎప్పటికీ తెలియదు. అందుకే ఎప్పుడూ కాస్త దయతో ఉండండి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Samantha

Samantha

ఇదిలా ఉంటే.. సమంతపై బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సమంతను ఉద్దేశించి మాట్లాడుతూ..”ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగిపో.. ” అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ… ట్రై చేస్తాను సర్ అంటూ కామెంట్ చేసింది సామ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..