Upasana-RamCharan: కుమార్తెలతో సద్గురు.. ఆసక్తికర పోస్ట్ చేసిన ఉపాసన.. దత్త పుత్రికనంటూ..

ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టా.. ట్విట్టర్లలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. తాజాగా ఆమె ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

Upasana-RamCharan: కుమార్తెలతో సద్గురు.. ఆసక్తికర పోస్ట్ చేసిన ఉపాసన.. దత్త పుత్రికనంటూ..
Upasana, Sadguru
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 6:17 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం స్టార్ హీరో భార్యగానే కాకుండా.. అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకోవడమే కాకుండా వ్యాపారరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉండే ఉపాసన.. ఫిట్ నెస్.. హెల్తీ టిప్స్ చెబుతూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటారు. అలాగే వ్యక్తిగత విషయాలు.. అనేక అంశాల గురించి నెట్టింట పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టా.. ట్విట్టర్లలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. తాజాగా ఆమె ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

సద్గురు.. ఆయన కుమార్తె రాధే జగ్గీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..”కుమార్తెలతో సద్గురు.. ఒకరు సొంత కుమార్తె అయితే.. మరొకరు దత్త పుత్రిక” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇటీవలే ఉపాసన తాతయ్య… అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలకు సద్గురు ఆయన కుమార్తె హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసన వారిద్దరికి ధన్యవాధాలు తెలిపారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.