Shaakunthalam: ‘మధుర గతమా.. కాలాన్నే ఆపకా ఆగావే సాగకా’.. శాకుంతలం నుంచి మరో లిరికల్ సాంగ్..
మెలోడి బ్రహ్మ మణిశర్మ శాకుంతలం చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన మధుర గతమా పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
శకుంతలగా అందాల ముద్దుగుమ్మ సమంత ..దుష్యంత మహారాజుగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తోన్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’. ఫ్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ లవ్ స్టోరి ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. సినిమా అనేది లార్జర్ దేన్ లైఫ్‌గా ఉండాలంటూ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ గుణశేఖర్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ శాకుంతలం చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన మధుర గతమా పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
“మధుర గతమా.. కాలాన్నే ఆపకా ఆగావే సాగకా… ” అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా.. ఆర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. దుర్వాసుడి శాపంతో దుష్యంతుడి ప్రేమకు.. గాంధర్వ వివాహానికి గుర్తుగా ఉచ్చిన పొగొట్టుకుంటుంది శకుంతల. ఆ శాపంతోనే తన భార్యని మర్చిపోతాడు దుష్యంతుడు. అలా ఒకరికొకరు దూరమైనప్పుడు శకుంతల మనసులోని బాధను వ్యక్తం చేసేది ఈ సాంగ్.
ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలకపాత్రలో నటించారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.