AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetha Singh: ‘కితకితలు’ హీరోయిన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి కుమారుడు కన్నుమూత

కితకితలు సినిమాలో తన నటనతో అందరినీ గిలిగింతలు పెట్టిన గీతాసింగ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత  కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

Geetha Singh: 'కితకితలు' హీరోయిన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి కుమారుడు కన్నుమూత
Actress Geetha Singh
Basha Shek
|

Updated on: Feb 18, 2023 | 6:52 AM

Share

కితకితలు సినిమాలో తన నటనతో అందరినీ గిలిగింతలు పెట్టిన గీతాసింగ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత  కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘పిల్లలూ.. కారులో అయినా బైక్‌పై అయినా జాగ్రత్తగా వెళ్లండి. కమెడియన్‌ గీతాసింగ్‌ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓం శాంతి’ అని ఆమె పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా కర్ణాటక రాష్ట్రంలో యాక్సిడెంట్‌ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గీతా ఫ్యామిలీకి ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు. నిజానికి గీతాసింగ్‌ పెళ్లి చేసుకోలేదు. అయితే తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన ఇద్దరు కుమారుల భారాన్ని తన భుజాలపై వేసుకుంది గీతాసింగ్‌. ఆ ఇద్దరు పిల్లలతో పాటు తన కజిన్ కూతురిని కూడా సొంత పిల్లలుగా పెంచుకుంటున్నారీ లేడి కమెడియన్. ప్రస్తుతం తన జీవితంలో ఈ ముగ్గురు పిల్లలే తనకు జీవితమని.. తనకు ఇంకెవ్వరూ లేరని గీతాసింగ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.అయితే గీతాసింగ్ పెద్ద కుమారుడు నలుగురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని, అతను అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం.

కాగా ఇండియా నుంచి వచ్చిన గీతాసింగ్‌ తెలంగాణలోనే స్థిరపడడంతో తెలుగు నేర్చుకున్నారు. ఆ తరవాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ‘ఎవడిగోల వాడిది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈమె దగ్గరైన గీతాసింగ్ ఆ వెంటనే అల్లరి నరేష్ సరసన ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 50కు పైగా సినిమాల్లో నటించారు. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ మధ్య జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేశారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొని తన చేదు అనుభవాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..