Athadu Movie: ‘అతడు’ సినిమాలోని ఈ చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?.. హీరోగా మొదటి సినిమా ఏంటంటే..

వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు... ఖలేజా చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ కెరీర్ లోనే అతడు చిత్రం బిగ్గెస్ట్ హిట్.

Athadu Movie: 'అతడు' సినిమాలోని ఈ చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?.. హీరోగా మొదటి సినిమా ఏంటంటే..
Athadu Movie Child Artist
Follow us

|

Updated on: Feb 18, 2023 | 10:04 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టా్ర్ మహేష్ ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులోని నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు... ఖలేజా చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ కెరీర్ లోనే అతడు చిత్రం బిగ్గెస్ట్ హిట్. ఇందులో త్రిష కథానాయికగా నటించగా.. సోనుసూద్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఈ మూవీలోని డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు.

ఇప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్‏లో ఉండడంతో థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్‏గా నటించిన చిన్నోడు కూడా అదే రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. ఆ చిన్నోడి పేరు దీపక్ సరోజ్. అతడు బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఆర్య, భద్ర, మినుగురులు, లెజెండ్ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన దీపక్.. ఇప్పుడు హీరోగా మారాడు.

దీపక్ కథానాయకుడిగా డైరెక్టర్ వి. యశస్వి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో తన్వి నేగి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కంటే ముందే దీపక్ హీరోగా తొలిసినిమా బంధనం మూవీతో పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా.. దీపక్ నటనకు మంచి పేరు తెచ్చింది.

ఇవి కూడా చదవండి
Siddarth Roy

Siddarth Roy

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.