Naresh: నటుడు నరేష్ ఇంటిపై దుండగుల దాడి.. ఆమె కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు..
నటుడు నరేష్ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ దాడిలో నరేష్‌కు సంబంధించిన కారవాన్ వెహికిల్‌తో పాటు..
నటుడు నరేష్ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ దాడిలో నరేష్‌కు సంబంధించిన కారవాన్ వెహికిల్‌తో పాటు ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు నరేష్. దాడి వెనుక తన భార్య రమ్య రఘుపతి హస్తముందని అనుమానాలు వ్యక్తం చేశారు నరేష్. ఆమె కారులో ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే తన పైన అటాక్ జరిగిందంటూ నరేష్ ఆరోపించారు. ఈ ఘటనపై నరేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు సీసీ ఫుటేజ్ ను సైతం పోలీసులకు అప్పగించారు.
కాగా, గత కొంతకాలం నుంచి రమ్య రఘుపతితో నరేష్‌కు విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతకుముందు సైతం ఇద్దరూ బహిరంగంగా ఘర్షణకు దిగిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో నరేష్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం..