SS Rajamouli: చెల్లెలు సింగర్ శ్రీలేఖతో రాజమౌళికి విభేదాలు.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..

అయితే వీరే కాకుండా ఆయనకు ఒక చెల్లి కూడా ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె పేరు శ్రీలేఖ. తెలుగు చిత్రపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్.. గాయనిగా రాణిస్తున్నారు.

SS Rajamouli: చెల్లెలు సింగర్ శ్రీలేఖతో రాజమౌళికి విభేదాలు.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..
Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2023 | 8:08 AM

యావత్ ప్రపంచంలోని సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్, రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి రాజమౌళి అన్నయ్య ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. జక్కన్న కుటుంబంలోని వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నవారే. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్స్ రాస్తుండగా.. అన్నయ్య కీరవాణి సంగీతం అందించడం.. రాజమౌళి భార్య రమ ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంటారు. అయితే వీరే కాకుండా ఆయనకు ఒక చెల్లి కూడా ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె పేరు శ్రీలేఖ. తెలుగు చిత్రపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్.. గాయనిగా రాణిస్తున్నారు.

ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు శ్రీలేఖ. అయితే రాజమౌళికి… తన చెల్లి శ్రీలేఖకు కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెకు ఆయన సినిమాల్లో చిన్న అవకాశం కూడా ఇవ్వరంటూ టాక్ వినిపిస్తుంటుంది. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న అనుబంధం గురించి బయటపెట్టారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి తమ బంధం గురించి వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు జక్కన్న.

సంగీత దర్శకురాలుగా ఎంఎం శ్రీలేఖ సినీ కెరీర్ లో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు. ఈ ఏడాది మార్చి 17 నుంచి ఈ పర్యటనను ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆమె సోదరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 5 భాషల్లో 80 చిత్రాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. తాను సాధించిన ఘనతలకు అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు. అలాగే ఆస్కార్ వేడుకకు వెళ్లబోతున్న రాజమౌళి అన్న చేతుల మీదుగా నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.