Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా ?.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం..

అక్కినేని కుటుంబరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రంలో బాలనటిగా నటించింది. తెలుగులో సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించిన తెలుగమయ్యాలలో ఆమె ఒకరు.

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా ?.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం..
Laya
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2023 | 7:34 AM

ఒకప్పుడు దక్షిణాదిలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్లలో లయ ఒకరు. స్వయంవరం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం అయిన లయ… ఆ తర్వాత ప్రేమించు.. మనోహరం, మనసున్న మారాజు.. నీ ప్రేమకై.. హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, పెళ్లాంతో పనేంటి, దేవుళ్లు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‏గా అరంగేట్రం చేయకముందే ఆమె.. అక్కినేని కుటుంబరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రంలో బాలనటిగా నటించింది. తెలుగులో సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించిన తెలుగమయ్యాలలో ఆమె ఒకరు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది లయ.

కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ మంచి సినిమాలతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో చివరగా.. బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇండస్ట్రీకి దూరమైన లయ… సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. నిత్యం తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‏కు అద్భుతంగా డాన్స్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. అలాగే ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది లయ. తాజాగా ఆమె కూతురికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

లయ కూతురు చైల్డ్ యాక్టర్ గా నటించింది. ఆమె పేరు శ్లోక. వీరిద్దరు కలిసి ఎక్కువగా షార్ట్ వీడియోస్ చేస్తూ సందడి చేస్తున్నారు. లయ కూతురు కూడా అచ్చం లయ పోలికలతోనే ఉండడంతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తుందేమో అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక లయ సైతం వయసు పెరిగిన తరగని అందంతో ఇప్పటి కుర్రహీరోయిన్లకు సైతం పోటీనిచ్చేలా ఉంటుంది లయ. తాజాగా ఇటీవలే లయ ఆమె కూతురు రెడ్ కలర్ డ్రెస్సులో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అక్కాచెల్లెళ్లుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.