Taraka Ratna: తారకరత్న అసలు పేరు ఏంటో తెలుసా ?.. ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారంటే..

నందమూరి నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు తారకరత్న. ఒక్క ఏడాదిలోనే 9 చిత్రాలను ప్రకటించి రికార్డ్ క్రియేట్ చేశారు. అందులో ఐదు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి.

Taraka Ratna: తారకరత్న అసలు పేరు ఏంటో తెలుసా ?.. ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారంటే..
Taraka Ratna
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 19, 2023 | 4:51 PM

నందమూరి తారకరత్న మరణాన్ని తెలుగు చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన మృత్యుంజయుడిగా తిరిగి వస్తారనుకుంటున్న సమయంలో.. తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయారు. శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజే శివైక్యం చెందారు తారకరత్న. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు తారకరత్న. ఒక్క ఏడాదిలోనే 9 చిత్రాలను ప్రకటించి రికార్డ్ క్రియేట్ చేశారు. అందులో ఐదు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్స్ కావడంతో కెరీర్ నెమ్మదించింది. అయితే అందరికీ తెలిసినట్లుగా ఆయన అసలు పేరు తారకరత్న కాదు.

వెండితెరకు తారకరత్నగా పరిచయమైన ఆయనకు మరో పేరు ఉంది. ఆయన అసలు పేరు ఓబులేసు. ఇంట్లోవాళ్లు ముద్దుగా ఓబు అని పిలుస్తారట. నందీశ్వరుడు సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ అలేఖ్య రెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను ఎదురించి స్నేహితుల సమక్షంలో అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు తారకరత్న. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే డిజిటల్ ప్లాట్ ఫాంపై వరుస వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆయన చివరగా.. ఎస్ 5 చిత్రంలో నటించారు. గతేడాది డిసెంబర్ 31న విడుదలైంది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రచన, సమర్పణలో వచ్చిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో పోలీస్ పాత్రలో నటించారు. అయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు వరుసగా వెబ్ సిరీస్ చేస్తున్న తారకరత్న ఇటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. టీడీపీలో యువనేతగా చేరిన ఆయన.. గత నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.