TFPC Elections: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్.. టీఎఫ్‏పీసీ ప్రెసిడెంట్‏ ఎవరంటే..

ఈ క్రమంలో ఇటీవల ఎలక్షన్స్ నిర్వహించాలంటూ చిన్న నిర్మాతలు గొడవ చేయగా.. నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నికలను ప్రకటించారు. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడ్డాయి.

TFPC Elections: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్.. టీఎఫ్‏పీసీ ప్రెసిడెంట్‏ ఎవరంటే..
Tfpc
Follow us

|

Updated on: Feb 19, 2023 | 5:45 PM

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి. నిర్మాత మండలి ఎన్నికలు ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల ఎలక్షన్స్ నిర్వహించాలంటూ చిన్న నిర్మాతలు గొడవ చేయగా.. నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నికలను ప్రకటించారు. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడ్డాయి.

ఇందులో మొత్తం 1134 మంది ఉండగా.. 678 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో దిల్ రాజు , సి. కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు, సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినిదత్ తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడగా.. దిల్ రాజు మద్దతుతో ఒక వర్గం.. సి. కళ్యాణ్ మద్దతుతో మరో వర్గం ఉంది. అద్యక్ష పదవి కోసం దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ పోటి పడగా.. నిర్మాత దిల్ రాజు దామోదర ప్రసాద్ కు.. సి. కళ్యాణ్ జెమిని కిరణ్ కు మద్దతు తెలిపారు.

సాయంత్రం నాలుగు గంటల తర్వాత మొదలైన ఎన్నికల్ కౌంటింగ్ లో విజేత ఎవరనేది తెలిసిపోయింది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్‏గా దామోదర ప్రసాద్ గెలుపొందారు. ఈ పోరులో జెమిని కిరణ్ కు 315 ఓట్లు పడగా.. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు పడ్డాయి. జెమిని కిరణ్ పై దామోదర ప్రసాద్ 24 ఓట్లు తేడాతో గెలిచారు. ఈ పోరులో రెండు ప్యానల్ నుంచి ప్రెసిడెంట్ తోపాటు.. సెక్రటరీ పోస్టులతోపాటు.. కమిటీ మెంబర్స్ పోస్టులకు కూడా పోటీ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles