Hansika: ఫస్ట్ బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హాన్సిక.. నేను అలాంటి వ్యక్తిని కాదంటూ..

ఇటీవలే ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన హన్సిక... తన మొదటి ప్రేమ, బ్రేకప్.. సోహెల్ తో పరిచయం పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Hansika: ఫస్ట్ బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హాన్సిక.. నేను అలాంటి వ్యక్తిని కాదంటూ..
Hansika
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 19, 2023 | 5:17 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ హన్సిక. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ స్పషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెండితెరపై అవకాశాలు తగ్గడంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు సినిమాలు.. వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ భామా.. గతేడాది తన స్నేహితుడు సోహెల్ ఖతురియాను వివాహం చేసుకుని దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టారు. గతేడాది డిసెంబర్ 4న జైపూర్ లోని ముండ్ తోట కోటలో కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే వీరి వివాహం.. పరిచయం.. ప్రేమ.. లవ్ షాదీ డ్రామా అనే పేరుతో సిరీస్‏గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన హన్సిక... తన మొదటి ప్రేమ, బ్రేకప్.. సోహెల్ తో పరిచయం పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

గతంలో హన్సిక హీరో శింబుతో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరు విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హన్సిక తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. “నాకు చాలా సంవత్సరాలు పట్టింది. మరొకరికి ఒకే అని చెప్పడానికి. బ్రేకప్ తర్వాత కోలుకుని కొత్త వ్యక్తి ప్రేమను అంగీకరించేందుకు కనీసం 7-8 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై నమ్మకం ఉంది. కానీ నేను రొమాంటిక్ వ్యక్తిని కానీ.. రొమాంటిక్ పర్సన్ గా చాలా ఎక్స్ ప్రెసివ్ కాదు. మనసులోని భావాలను త్వరగా బయటపెట్టలేను. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. ప్రేమను విశ్వసిస్తాను. నిజం చెప్పాలంటే నాతో భవిష్యత్తులో ఉండబోయే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం తీసుకున్నాను.

ఇవి కూడా చదవండి

సోహెల్ ప్రేమను నేను ఎక్కువగా నమ్ముతాను. అతను నా ప్రేమ కోసం ఎదురుచూశారు. దేవుడు మాకు కొత్త దారి చూపించాడు. ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మొదటి ప్రేమ నుంచి తాను ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని.. ఆ బంధం ముగిసిందని.. అందుకు ఇప్పుడు మరో కొత్త బంధం ప్రారంభమైందని తెలిపింది. ప్రతి సంబంధానికి దాని సొంత మార్గం ఉంటుందని విశ్వసిస్తున్నాను అని తెలిపారు. ప్రస్తుతం హన్సిక ఎంవై3 అనే సిరీస్ లో నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.