Mamta Mohandas: ‘చీకటి గదిలో ఒంటరిగా ఎన్నో రోజులు ఏడ్చాను’.. హీరోయిన్ మమతా మోహన్ దాస్  ఎమోషనల్..

రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచిన తనకు.. ఆరోగ్య సంరక్షణ, వ్యాయామం జీవితాన్ని ఎంతో మెరుగుపరిచాయని చెప్పుకొచ్చింది.

Mamta Mohandas: 'చీకటి గదిలో ఒంటరిగా ఎన్నో రోజులు ఏడ్చాను'.. హీరోయిన్ మమతా మోహన్ దాస్  ఎమోషనల్..
Mamta Mohandas
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 19, 2023 | 5:17 PM

హీరోయిన్‏గా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. కథానాయికగా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ భారిన పడింది. ఒక్కసారి కాదు.. రెండు సార్లు క్యాన్సర్ బారిన పడి.. సంవత్సరాల పోరాటం తర్వాత గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకుని ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న తరుణంలోనే మరో అరుదైన వ్యాధి బారిన పడింది. జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు..మానసిక స్థైర్యంతో సమస్యలకు ఎదురు నిలిచి ఎంతో మంది అమ్మాయిలకు స్పూర్తిగా నిలుస్తోంది. తనే మమతా మోహన్ దాస్. రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచిన తనకు.. ఆరోగ్య సంరక్షణ, వ్యాయామం జీవితాన్ని ఎంతో మెరుగుపరిచాయని చెప్పుకొచ్చింది.

తన జీవితంలో ప్రయోగాలు ముగియడం లేదని.. ప్రస్తుతం మరో కొత్త సమస్యతో పోరాడుతున్నానని అన్నారు. ప్రస్తుతం మమతా మోహన్ దాస్ తనకు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందని వెల్లడించింది. తనకు బొల్లి అనే చర్మ సమస్య ఉందని ఇటీవల చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మమతా..తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు మహేష్ మారుతియుమ్ షూటింగ్ సమయంలోనే నా శరీరంపై తెల్లటి మచ్చలను గమనించాను. ఆ తర్వాత ముఖం, మెడ, అరచేతులకు కూడా వ్యాధి వ్యాపించింది. టాబ్లెట్స్ వేసుకున్నా ఊపిరితిత్తుల సమస్యలు రావడంతో ట్యాబ్లెట్స్ తగ్గించాను. దీంతో శరీరం మొత్తం మచ్చలు పెరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

“నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నా ధైర్యాన్ని నమ్ముకున్నాను. నువ్వు స్ట్రాంగ్ అని చాలా మంది చెప్పేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఒంటరిగా ఉండిపోయాను. స్నేహితులను పిలవలేదు. రోజుల తరబడి ఒంటరిగా కూర్చొని ఏడ్చేసాను. ఎప్పుడూ కెమెరా ముందే ఉండే వ్యక్తి.. అలా ఒంటరిగా చీకట్లో ఉండిపోవడం చాలా ఎక్కువ. నెలల పాటు నన్ను నేను ఒంటరిగా ఉన్నాను. కానీ అలా ఉండిపోవడం నన్ను చంపేస్తుందని తెలుసుకున్నాను. అందుకే నా సమస్యను బయటపెట్టాను. అప్పుడు కాస్త్ ప్రశాంతంగా ఉంది. నాకేమైందని ఎవరైన అడిగితే ఇన్ స్టా చూడమని చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు మమతా..

View this post on Instagram

A post shared by Mamta Mohandas (@mamtamohan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!