AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Today: ‘లవ్ టుడే’ సినిమా వెనక ఇంత కథ ఉందా ?.. డైరెక్టర్ ప్రదీప్ మాములోడు కాదు భయ్యా..

తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది.

Love Today: 'లవ్ టుడే' సినిమా వెనక ఇంత కథ ఉందా ?.. డైరెక్టర్ ప్రదీప్ మాములోడు కాదు భయ్యా..
Love Today
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2023 | 8:25 AM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో లవ్ టుడే ఒకటి. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ లవ్ స్టోరీ యూత్‏ను కట్టిపడేసింది. చిన్న సినిమా అయినా అంచనాలను తారుమారు చేస్తూ వసూళ్ల వర్షం కురిపించింది. ఏజీఎస్ సంస్థ నిర్మించిన ఈ లవ్ టుడే చిత్రంలో ప్రదీప్ కథానాయకుడిగా నటించగా.. హీరోయిన్‏గా ఇవానా కనిపించింది. ఇందులో రాధిక శరత్ కుమార్, సత్యరాజ్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషఇంచారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూలు చేసినట్లుగా చిత్రవర్గాలు తెలిపాయి. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది.

ఈ క్రమంలో మేకర్స్ లవ్ టుడే మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 45 నిమిషాల నిడివిగల ఈ మేకింగ్ వీడియో మరోసారి సినీ ప్రియులను కట్టిపడేసింది. 2019 జయం రవి ప్రధాన పాత్రలో కోమలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రదీప్. ఆ తర్వాత ఆయన నటించి తెరకెక్కించిన సినిమా లవ్ టుడే. కోమలి తర్వాత గ్యాప్ రావడానికి.. లవ్ టుడే సినిమాను తెరకెక్కించేందుకు వచ్చిన ఆలోచనల గురించి ఈ వీడియోలో చెప్పుకొచ్చారు ప్రదీప్.

అంతేకాకుండా.. లవ్ టుడే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఎదురైన సంఘటనలు.. అనుభవించిన మానసిక సంఘర్షణ.. స్క్రిప్ట్ డెవలప్ అన్ని విషయాలను పంచుకున్నారు ప్రదీప్. మొత్తానికి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న లవ్ టుడే సినిమా కోసం ప్రదీప్ ఎంతగా కష్టపడ్డారు.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది.. దర్శకుడిగా తనను ఎలా మలుచుకున్నాడు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకొచ్చారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ.. ఎన్నో అవమానాలు.. కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు అందుకున్న భారీ విజయమే ‘లవ్ టుడే’. మేకింగ్ వీడియో మీరు చూసేయ్యండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.