Varasudu: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి ‘వారసుడు’.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..
తెలుగుతోపాటు.. తమిళంలోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ను ముగించుకున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రం వారసుడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అందుకుంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీని తెలుగుతోపాటు.. తమిళంలోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ను ముగించుకున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ముందు ఈ సినిమాను మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు సినీ ప్రియులకు సర్ ప్రైజ్ ఇస్తూ.. ఈ చిత్రాన్ని 4 భాషల్లో ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు.. తమిళ్.. మలయాళం సహా కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఇప్పటివరకు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్…ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.