OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్ వీకెండ్.. ఒకేసారి ఓటీటీలోకి వచ్చేస్తోన్న బ్లాక్‌బస్టర్ మూవీస్..
తక్కువ బడ్జెట్‌లో ఇంటిళ్లపాది ఓటీటీలోనే కొత్త మూవీస్ చూసేందుకు కొంతమంది ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే..

కరోనా పుణ్యమా అని ఓ వర్గం ప్రేక్షకులకు ఓటీటీలు బాగా దగ్గరయ్యాయి. వేలు ఖర్చుపెట్టుకుని థియేటర్లలో సినిమా చూసే బదులు.. తక్కువ బడ్జెట్‌లో ఇంటిళ్లపాది ఓటీటీలోనే కొత్త మూవీస్ చూసేందుకు కొంతమంది ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీలు ప్రతీ వారం సరికొత్త వెబ్‌సిరీస్‌లు, లేటెస్ట్ సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వారం సంక్రాంతి హిట్ సినిమాలతో పాటు ఇంకొన్ని బ్లాక్‌బస్టర్ మూవీస్ సైతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం పదండి.
-
వారసుడు:
దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారసుడు’. ఈ మూవీ అటు తమిళం.. ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ అందుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బాణీలు అందించాడు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీల్లో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
-
వీరసింహారెడ్డి:
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ఫిబ్రవరి 23 నుంచి తెలుగు, మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
-
మైకేల్:
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘మైకేల్’. ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ కాగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ‘ఆహా’ వేదికగా ఈ నెల 24 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
This Week Streaming Movie
Feb 22:#Varisu Amazon Prime Video – Tamil, Telugu & Malayalam
Feb 23:#VeeraShimaReddy – Hotstar – Tel, Mal, Kan, Tam & Hin#NanpakalNerathuMayakkam – Netflix – Mal, Hin & Tel#Micheal – AHA – Tel & Tam
Feb 24:#IruDhuruvam2 – SonyLIV – Tam
— OTT CINEMA UPDATES (@OTTCINEMAUP) February 20, 2023
ఇవే కాకుండా మమ్ముట్టి నటించిన ‘నన్పక నేర్తు మయక్కం’ ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో.. కన్నడ హీరో దర్శన్ నటించిన ‘క్రాంతి’ ఫిబ్రవరి 23 నుంచి కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. ఫిబ్రవరి 24న ఇరుధృవమ్-2 తమిళంలో సోనీ లివ్ ఓటీటీ వేదికగా.. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతాయి.
Kannada movie #Kranti digital arrives February 23 on Prime Video.
Available in – Kannada (Original), Tamil, Telugu & Malayalam.#KrantiOnPrime pic.twitter.com/ojMdDR3jcN
— Ott Updates (@Ott_updates) February 20, 2023




