Sir Movie: ఓటీటీలోకి ధనుష్ సార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Feb 21, 2023 | 7:37 PM

ఈ మూవీలో విద్యావ్యవస్థ గురించి అద్భుతంగా చూపించారు. ఇక ధనుష్ నటన ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌లో కూడా క్రేజ్ సంపాదించుకున్న ధనష్.. ఫస్ట్ టైం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు.

Sir Movie: ఓటీటీలోకి ధనుష్ సార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..
Sir Movie

ధనుష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సార్ . టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో విద్యావ్యవస్థ గురించి అద్భుతంగా చూపించారు. ఇక ధనుష్ నటన ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌లో కూడా క్రేజ్ సంపాదించుకున్న ధనష్.. ఫస్ట్ టైం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. రావడం రావడమే తనకందరూ ఫిదా అయ్యేలా చేసుకున్నారు ధనుష్. తనకే సాధ్యమైన ఎమోషన్ అండ్ ఇంటెన్సివ్‌ యాక్టింగ్ తో.. అండ్ నాచురల్ లుక్స్‌తో.. విద్య విలువ ఏంటో .. మరో సారి అందరికీ ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు ధనుష్.

కార్పోరేట్ శక్తుల చేతుల్లో విద్య ఎలా బలవుతోందన్న విషయాన్ని నేరుగా చెప్పి.. అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్నారు. తెలుగు టూ స్టేట్స్‌ లో సూపర్ డూపర్ టాక్ తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే సార్ సినిమా ఓటీటీలో వచ్చేది అప్పుడే అనే టాక్ వినిపిస్తుంది. ఉగాది సందర్భంగా సార్ సినిమా ఓటీటీలో తీసుకురావాలని చూస్తున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu