Peddi Movie : ఉప్పెన కంటే పెద్దిలో 100 రెట్ల ట్విస్ట్.. సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సినిమా పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. జూన్ 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ గురించి చరణ్, బుచ్చిబాబు సన మాట్లాడుకుంటూ షేర్ చేసిన వీడియో వైరలవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నే ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా్రు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదివరకు విడుదలైన పెద్ది ట్రైలర్ అంచనాలు పీక్స్ కు చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహిస్తుంది. తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ ముచ్చటించిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పెద్ది సినిమా గురించి చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్లో ట్రెండింగ్..
ఈ వీడియోలో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. “సినిమా మొత్తంలో మీకు ఇష్టమైన ఎపిసోడ్ ఏది ? ” అని అడగ్గా.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. కథ పరంగా ఈ ఎపిసోడ్ లో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని.. సినిమాలోనే ఇది అత్యంత కీలకమైన ఘట్టమని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..
ఢిల్లీ ఎపిసోడ్ గురించి చరణ్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెనలోని క్లైమాక్స్ ట్విస్టుతో చరణ్ పోల్చారు. ఉప్పెన సినిమాలో వచ్చే ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ షాకింగ్ ట్విస్టులు ఇందులో ఉంటాయని అన్నారు. దీంతో చరణ్ మాటలతో పెద్ది సినిమాపై అంచనాలు తారాస్తాయికి చేరాయి. పెద్ది చిత్రంలో ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉంటాయని ..మొత్తానికి థియేటర్లలో మెగా అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్లో ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..
