Sandeep Kishan: ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్.. అండగా నిలిచిన అభిమానుల కోసం క్రేజీ ఐడియా..
ఎన్నో అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా శుక్రవారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరు చిత్రాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు ఈ హీర్. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం మైఖేల్. తన కెరీర్లో తొలిసారిగా వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు రంజిత్ జెయకోడి దర్శకత్వం వహించగా..సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా శుక్రవారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
మైఖేల్ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఆహా టీం ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో సందీప్ అభిమానులకు ఓ ప్రామిస్ చేశాడు. అభిమానులకు ఆహా వీడియో 2000 త్రైమాసిక సభ్యత్వాలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. తనకు అన్ని సమయాల్లో అండగా నిలిచినందుకు సందీప్ కిషన్ అభిమానులకు.. స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈగ్యాంగ్ స్టర్ డ్రామాలో విజయ్ సేతుపతి.. వరలక్ష్మి శరత్ కుమార్.. వరుణ్ సందేశ్.. గౌతం వాసుదేవ్ మీనన్ అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.
భరత్ చౌదరి, పుస్కూర్ రామ్, మోహన్ రావు కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్ ఎల్ఎల్పీ బ్యానర్ లపై భారీ ఎత్తిన నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కన్నడ, హిందీ భాషలతో పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ అయింది.
“THE MICHAEL PARTY” Will be Gifting 2000 @ahavideoIN Quarterly subscriptions on the Occasion of #Michael ‘s Digital Premiere this Friday ?
Thank my Fans & Friends for always standing by me through all my efforts in my Love for the World of Cinema ?#Telugu #Tamil pic.twitter.com/1jou0N4Wmx
— Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) February 21, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.