AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simbu: పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. ఆ దేశ బడా వ్యాపారవేత్త కూతురితో వివాహం ?..

ఇప్పటికే అనేక సార్లు ఈ హీరో పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరలయ్యాయి. ఇప్పుడు మరోసారి శింబు పెళ్లి ప్రస్తావన వినిపిస్తోంది.

Simbu: పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. ఆ దేశ బడా వ్యాపారవేత్త కూతురితో వివాహం ?..
Simbu
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2023 | 2:45 PM

Share

తమిళ్ స్టార్ హీరో శింబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. టాలీవుడ్‏లోనూ అభిమానులు ఉన్నాయి. వల్లభ, మన్మధ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శింబు. కేవలం నటుడిగానే కాకుండా.. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. రచయితగానూ ఈహీరోకు మంచి గుర్తింపు ఉంది. తెలుగులోనూ అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి మెప్పించాడు. అయితే సినిమాలతోనే కాదు.. వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం వార్తలలో నిలుస్తుంటాడు ఈ హీరో. లవ్ ఎఫైర్స్, డేటింగ్ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. గతంలో తెలుగు, తమిళ్ హీరోయిన్లతో శింబు ప్రేమాయణం నడిపినట్లుగా టాక్ నడించింది. అలాగే వారితో క్లోజ్ గా ఉన్న ఫోటోస్ అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. తాజాగా శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అనేక సార్లు ఈ హీరో పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరలయ్యాయి. ఇప్పుడు మరోసారి శింబు పెళ్లి ప్రస్తావన వినిపిస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురితో శింబు ఏడడుగులు వేయబోతున్నాడని సమాచారం. ఆమెతో ఈ హీరో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని.. ఆ అమ్మాయి ఓ మెడికల్ స్టూడెంట్ అని తెలుస్తోంది. ఆమె తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు ఉన్నాయని.. అయితే ఆ అమ్మాయి శింబుకు వీరాభిమాని కావడం… ఈ క్రమంలోనే ఓసారి శింబును కలవడం..వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చినట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక వీరి పెళ్లికి కూడా ఇరు కుటుంబాల సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే వీరి వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే తన కుమారుడు శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన తండ్రి డి. రాజేంద్రన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇదే సమయంలో శింబు పెళ్లి గురించిన వార్తలు వినిపించడంతో.. ఈసారి నిజంగానే శింబు ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?