AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత పెన్షన్‌, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యోగ సంస్థల పిలుపు.. మార్చి 26న విశాఖలో బహిరంగసభ.. సదస్సు పూర్తి వివరాలివే..

నేషనల్‌ పైప్‌ లైన్‌ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ లక్ష్యాల సాధన కోసం దశలవారీగా పోరాటాన్ని..

పాత పెన్షన్‌, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యోగ సంస్థల పిలుపు.. మార్చి 26న విశాఖలో బహిరంగసభ.. సదస్సు పూర్తి వివరాలివే..
Aisgef Conference In Mbvk Vijayawada
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 27, 2023 | 8:45 AM

Share

పాత పెన్షన్‌ విధాన సాధన, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణే లక్ష్యంగా పోరాటానికి సిద్ధం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంటు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య పిలుపునిచ్చాయి. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన వేదిక(ఎంబివికే)లో ఉద్యోగ సంస్థల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఎఐఎస్‌జిఇఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షులు, ఎపిఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో.. ఆయా సంఘాల నాయకులు నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ పైప్‌ లైన్‌ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ లక్ష్యాల సాధన కోసం దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా విస్తృత ప్రచారం, రాష్ట్రాల వారీ సదస్సులు, సభలతో పాటు నవంబర్‌ మూడవ తేదిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 26న విశాఖలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు.

అనంతరం ఎఐఎస్‌జిఇఎఫ్‌ ఛైర్మన్‌ సుభాష్‌ లాంబా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా తాలుకా, మండల కేేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో 100 బస్‌స్టాండ్‌లను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విలువైన ఆస్తులను ప్రైవేటుకు లీజుకు ఇచ్చే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సారి గెలిస్తేనే వారికి పెన్షన్‌ ఇస్తున్న ప్రభుత్వం 25, 30 ఏళ్లు సర్వీస్‌ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ హక్కును ఎలా తీసి వేస్తుందని ప్రశ్నించారు. దీనికోసం మార్చి 14న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అనేక కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఎన్‌పిఎస్‌ నుంచి ఓపిఎస్‌కు వచ్చాయన్నారు. అలాగే సంఘ జనరల్‌ సెక్రటరీ ఎ. శ్రీకుమార్‌ మాట్లాడుతూ నవంబరు 3న జరగనును చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. డిసెంబరు 8న న్యూఢిల్లీలో జరిగిన జాయింట్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఈ నిర్ణయం తీసుకునుట్లు తెలిపారు.

పార్లమెంటు వద్ద ధర్నా, బైక్‌ ర్యాలీలు, పాఠశాలల వద్ద ప్రచారం వంటి దశల వారి కార్యక్రమం తరువాత నవంబర్‌లో చలో ఢిల్లీ నిర్వహిస్తామనితెలిపారు. రీపిల్‌ పిఎఫ్‌ఆర్‌డిఎ యాక్ట్‌‌ను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, రోజు వారీ వేతనం పొందే ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని, ట్రేడ్‌ యూనియన్‌ డెమెక్రాటిక్‌ రైెట్స్‌ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సంస్థలు అన్ని కలిసి పోరాటం చేయాలనాురు. కేంద్ర ఫ్రభుత్వం మేక్‌ఇన్‌ ఇండియా ప్రోగ్రాం పేరుతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిందని, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్పటికీ ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ రంగ సంస్ధలైన ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారుల నిర్వహణ, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ సంస్థలు, ఫ్యాక్టరీలు, నౌకాశ్రయాలు ప్రైవేటీకరణ చేస్తున్నాయన్నారు. ఎన్‌పిఎస్‌ అనేది ఒక దోపిడీ అని అన్నారు. ఫండ్‌మేనేజర్‌గా ఉన్న ఎల్‌ఐసి అదాని కంపెనీల్లో అత్యధిక భాగం షేర్లలో పెట్టుబడులు పెట్టిందన్నారు, అదానికి ఉన్న 7 కంపెనీల్లో జనవరి 24న వారి షేర్ల విలువ రూ.74వేలకోట్లు కాగా, పిబ్రవరి 23న షేర్ల విలువ రూ.26వేలకోట్లకు పడిపోయాయన్నారు. ఫలితంగా నికరంగా 45వేలకోట్ల మేర ఎల్‌ఐసి నష్టపోయిందన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..