Special Trains: సమ్మర్ స్పెషల్.. విశాఖపట్నం నుంచి ఆ స్టేషన్లకు 5 స్పెషల్ ట్రైన్.. పూర్తి వివరాలివే..
రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఈ వేసవిలో వారానికి ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపాలని..
వేసవి కాలం అంటే ప్రయాణాలే. స్కూల్ విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ సొంత ఊర్లకు వెళ్లే సమయం. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఈ వేసవిలో వారానికి ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఇక ఆ రైళ్లు విశాఖపట్నం,సికింద్రాబాద్.. విశాఖపట్నం, మహబూబ్‌నగర్.. విశాఖపట్నం, తిరుపతి.. భువనేశ్వర్, తిరుపతి.. విశాఖపట్నం, బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య 5 వీక్లీ స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. వాటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం..
1. విశాఖపట్నం,సికింద్రాబాద్ మధ్య వీక్లీ స్పెషల్:
ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి అందిన సమాచారం ప్రకారం విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు(08579) మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 08.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అంటే ఈ ట్రైన్ మొత్తం 9 పర్యటనలు చేస్తుంది. ఈ క్రమంలో విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ 11 స్టేషన్లలో ఆగనుంది. అవి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ. ఇక తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08580) మార్చి 2 నుంచి ఏప్రిల్ 27 వరకు ప్రతి గురువారం రాత్రి 07.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 06.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా ఆయా స్టేషన్లలో ఆగుతుంది అలాగే 9 పర్యటనలు చేస్తుంది.
2. విశాఖపట్నం, మహబూబ్‌నగర్ మధ్య వీక్లీ స్పెషల్
ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి అందిన సమాచారం ప్రకారం విశాఖపట్నం- మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు(08585) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 05.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. ఈ క్రమంలో ఈ రైలు 8 పర్యటనలు తిరగనుంది. అలాగే ఈ ట్రైన్ విశాఖపట్నం-కింద్రాబాద్ మధ్య దువ్వాడ, అన్నవరం సామర్లకోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉమాదానగర్, షాద్‌నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో మహబూబ్‌నగర్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08586) మార్చి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు బుధవారాల్లో 06.20 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
3. విశాఖపట్నం, తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైలు
అలాగే విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(08583) మార్చి 6 నుంచి ఏప్రిల్ 24 వరకు సోమవారాల్లో రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇదే విధంగా ఈ ట్రైన్ 8 సార్లు తిరుగుతుంది. అలాగే ఈ ట్రైన్ విశాఖపట్నం-తిరుపతి మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మధ్య ఆగుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08584) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా 8 సార్లు ప్రయాణిస్తుంది.
4. విశాఖపట్నం, బెంగుళూరు కంటోన్మెంట్ మధ్య వీక్లీ స్పెషల్
అంతేకాకుండా విశాఖపట్నం-బెంగుళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ రైలు(08543) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. అంటే ఈ ట్రైన్ కూడా మొత్తం 9 పర్యటనలు చేస్తుంది. అలాగే ఈ రైలు విశాఖపట్నం-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ఇక తిరుగు దిశలో బెంగుళూరు కంటోన్మెంట్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08544 ) మార్చి 6 నుంచి మే 1 వరకు సోమవారాల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 11.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
5. భువనేశ్వర్, తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైలు
మరో రైలు భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(02809) మార్చి 4 నుంచి ఏప్రిల్ 29 వరకు శనివారాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు 07.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా 9 సార్లు ఆయా స్టేషన్ల మధ్య తిరుగుతుంది. ఇక ఈ ట్రైన్ భువనేశ్వర్, తిరుపతి మధ్య ఖుర్దారోడ్, బలుగాన్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. అలాగే తిరుగు దిశలో తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్(02810) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారాల్లో తిరుపతి నుంచి 20.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 16.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.