Visakhapatnam: గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు ముస్తాబవుతోన్న విశాఖ.. భారీగా పెట్టుబడులకు ఆహ్వానం..
గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు విశాఖ సిద్ధమవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్..
గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు విశాఖ సిద్ధమవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆతిధ్యం ఇవ్వనుంది. రెండు రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు కు సాగరతీరం ముస్తాబవుతోంది. ఏపీలో ఉన్న వనరులు, ఏపీ శక్తిసామర్ధ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కల్పిస్తున్న అవకాశాలు ఏపీ పారిశ్రామిక ప్రగతిని ఈ సమ్మిట్ లో వివరించనున్నారు. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం పాటుపడుతోందని నేతలు చెబపుతున్నారు. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు పదుల సంఖ్యలో హాజరు కానున్నాయి.
యన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కేఎం బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ సమ్మిట్ కి కేంద్ర మంత్రులూ హాజరవుతున్నారు. దేశీయ టెక్, డేటా రంగాల అభివృద్ధిలో ఏపీ నిర్వహిస్తున్న పాత్ర గురించి ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడనున్నారు. తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగి ఉన్న ఏపీలో సముద్ర వాణిజ్యం మెయి్ గా లమారింది. ఈ రంగంలో రాష్ట్రానికి ఉన్న అపార అవకాశాలపై రాష్ట్ర కేంద్ర మంత్రులు వివరించనున్నారు.
కాగా.. ముఖ్యమంత్రి జగన్.. మూడు రాజధానులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నగరాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు, అక్కడికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలను ఇందుకోసం ఇప్పటికే ఆహ్వానించారు. తద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులను రాబట్టాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..