Minister Roja: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన మంత్రి రోజా.. ఏమన్నారో తెలుసా..
టీడీపీ లీడర్ లోకేశ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీలో మంత్రులను చంద్రబాబు పపెట్‌లా ఆడించారన్న మంత్రి.. జగన్ అందరినీ తమ సొంత మనిషిలా చూస్తున్నారన్నారు. నలుగురి..
టీడీపీ లీడర్ లోకేశ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీలో మంత్రులను చంద్రబాబు పపెట్‌లా ఆడించారన్న మంత్రి.. జగన్ అందరినీ తమ సొంత మనిషిలా చూస్తున్నారన్నారు. నలుగురి కోసం మాట్లాడి చప్పట్లు కొట్టుకుంటే ఫలితం లేదని మండిపడ్డారు. లోకేశ్ ది యువగళం కాదన్న మంత్రి రోజా.. గంగాళం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిపై చర్చకు మేమే రమ్మంటున్నాం వస్తారా.. అని సవాల్ విసిరారు. భయపడి ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఛాలెంజ్‌కైనా మేము సిద్ధమని మంత్రి రోజా స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం కోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణస్వామి, ఆర్కే రోజా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ముఖ్య నేతలు హాజరయ్యారు.
పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేశ్ తీరు ఉంది. లోకేశ్ తన స్ధాయి మరిచి మాట్లాడుతున్నాడు. మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేశ్ తిరుగుతాడా? చంద్రబాబు, లోకేశ్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయాలి. మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఆధారాలతో రా లోకేశ్. నీ పాదయాత్రకు జనాలు లేరు. చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ ఛార్జ్ లూ కూడా లేని పార్టీ వాళ్లది.
– రోజా, ఏపీ మంత్రి
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ఇది చంద్రబాబు పార్టీ కాదు …ఎన్టీఆర్ పార్టీ. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ బతకదని అర్థం అయ్యిందని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అవ్వడంతో వారాహితో పవన్ కళ్యాణ్ ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..