Andhra Pradesh: నెల్లూరులో ఘోర ప్రమాదం.. చెరువులో పడవ బోల్తా.. ఆరుగురి యువకుల గల్లంతు

నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు

Andhra Pradesh: నెల్లూరులో ఘోర ప్రమాదం.. చెరువులో పడవ బోల్తా.. ఆరుగురి యువకుల గల్లంతు
Drown
Follow us

|

Updated on: Feb 26, 2023 | 10:37 PM

నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో మొత్తం పది మంది యువకులు ఉన్నారు. అయితే నలుగురు యువకులు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు..పముజుల బాలాజీ(20), బట్టా రఘు(25), అల్లి శ్రీనాథ్ (16), మన్నూరు కళ్యాణ్(30), చల్లా ప్రశాంత్ కుమార్(26), పాటి సురేంద్ర(16)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారాయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. అయితే గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..