PSL 2023: 40 ఓవర్లు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు.. ! పరుగులతో హొరెత్తిపోయిన లాహోర్ స్టేడియం..
బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడి గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. అంతే.. బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్లు పరుగుల వర్షం కురిపిస్తున్నారు. కాస్త అటూఇటూగా ప్రతి మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. అవకాశం లభించిన ప్రతిసారీ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్‌లను రాబడుతున్నారు. పీఎస్ఎల్ 2023లో భాగంగా ఫిబ్రవరి 26 లాహోర్ ఖలందర్స్, షావర్ జల్మీ జట్ల మధ్య గడాషీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు శివాలెత్తడంతో పరుగుల వర్షం కురిసింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడి గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. అంతే.. బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి.
అయితే తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం తగ్గకుండా విజృంభించి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగింది. అయితే టార్గెట్ భారీ పర్వతంలా ఉండడంతో 40 పరుగులు తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Starting from where they left off in Lahore! @lahoreqalandars record a resounding victory over @PeshawarZalmi despite a couple of fighting fifties in the chase.#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvPZ pic.twitter.com/RQkideQ3Ur
— PakistanSuperLeague (@thePSLt20) February 26, 2023
ఇక పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; 1 సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పరుగులు రాబట్టారు. ఇలా పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. ఇక లాహోర్ ఖలందర్స్ తరఫున షాహీన్ అఫ్రిది (5/40) పెషావర్ పతనాన్ని శాసించగా.. జమాన్ ఖాన్ 2, హరీస్ రౌఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..