AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్‌లో ఈ 4 సెర్చ్ చేశారో ఇక జైలే.. కాపాడటానికి కోర్టులు కూడా సాయపడవ్

గూగుల్‌లో కొన్ని విషయాలు సెర్చ్ చేయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. బాంబుల తయారీ పద్ధతులు, చైల్డ్ అడల్ట్ కంటెంట్, పైరేటెడ్ సినిమాలు డౌన్‌లోడ్ చేయడం, హ్యాకింగ్ విధానాలు వంటివి వెతికితే సైబర్ క్రైమ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. మీ ఫోన్ మీదే అయినా, గూగుల్ సెర్చ్ హిస్టరీ మీది కాదు. ఈ సెర్చ్‌లు మిమ్మల్ని జైలుకు పంపగలవు.

Google: గూగుల్‌లో ఈ 4 సెర్చ్ చేశారో ఇక జైలే.. కాపాడటానికి కోర్టులు కూడా సాయపడవ్
Google Search
Ravi Kiran
|

Updated on: Mar 17, 2026 | 12:58 PM

Share

గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కొన్ని రకాల సెర్చ్‌లు మిమ్మల్ని నేరుగా జైలుకు పంపగలవని హైకోర్ట్ అడ్వకేట్ హెచ్చరించారు. సైబర్ నేరాల విభాగం నిరంతరం ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచుతుందని, మీ ఫోన్ మీదే అయినా, గూగుల్ మీదని భావించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని, వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో చేసే కొన్ని ఆన్‌లైన్ చర్యలు చట్టపరమైన చిక్కులకు దారితీస్తాయని ఆయన వివరించారు.

గూగుల్‌లో సెర్చ్ చేయకూడని నాలుగు ముఖ్యమైన అంశాలను వివరించారు:

1. బాంబుల తయారీ విధానం:

బాంబులను ఎలా తయారు చేయాలి, వాటి కోసం ఏ రసాయనాలను(సల్ఫర్, అల్యూమినియం, అమ్మోనియం నైట్రేట్ వంటివి) వాడాలి, వాటిని ఎలా ప్రయోగించాలి వంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీరు వెంటనే పోలీసుల దృష్టిలో పడతారు. మీ మొబైల్ సెర్చ్ హిస్టరీని మీరు డిలీట్ చేసినా, గూగుల్ హిస్టరీలో అది నమోదై ఉంటుంది. ఇలాంటి సెర్చ్‌లు దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా పరిగణిస్తారు. తక్షణ అరెస్టుకు దారితీస్తాయి. బెయిల్ కూడా లభించని నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉంది.

2. చైల్డ్ అశ్లీల చిత్రాలు:

చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను సెర్చ్ చేయడం, చూడటం, డౌన్‌లోడ్ చేయడం లేదా ఫార్వార్డ్ చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి కంటెంట్‌ను మీ మొబైల్‌లో చూస్తున్నారని తెలిస్తే, పోలీసులు ఏ స్థితిలో ఉన్నారని చూడకుండా వచ్చి అరెస్ట్ చేస్తారు. పోక్సో(POCSO) చట్టం కింద దీనికి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ నేరం నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఏ న్యాయవాది లేదా న్యాయస్థానం సహాయపడలేడని నొక్కి చెప్పారు. కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇతరులకు పంపితే నేరం తీవ్రత మరింత పెరుగుతుంది.

3. పైరేటెడ్ సినిమాలు:

థియేటర్‌లలో విడుదల కాకముందే కొత్త సినిమాలను(హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్) డౌన్‌లోడ్ చేయడం లేదా వాటి గురించి వెతకడం కూడా చట్టవిరుద్ధం. ఇలాంటి పైరేటెడ్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసిన వెంటనే మీరు శిక్షార్హులు అవుతారు. సైబర్ క్రైమ్ అధికారులు మీ సెర్చ్ కార్యకలాపాలను ట్రాక్ చేసి, మీ ఇంటి వద్దకు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

4. హ్యాకింగ్ పద్ధతులు:

ఇతరుల ఫోన్‌లను(కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, బాస్) ఎలా హ్యాక్ చేయాలి, వారి డేటాను ఎలా సేకరించాలి, పాస్‌వర్డ్‌లను ఎలా రికవరీ చేయాలి(బ్యాంకింగ్, ఫోన్ పాస్‌వర్డ్‌లు), హ్యాక్ చేసిన ఫోన్‌ల నుంచి అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఎలా పంపాలి వంటి విషయాలను సెర్చ్ చేయడం సైబర్ నేరంగా పరిగణిస్తారు. మీ శత్రువుల ఫోన్‌లను హ్యాక్ చేయడానికి పద్ధతులు వెతికినా కూడా ఇది తీవ్రమైన నేరమే.

తల్లిదండ్రులకు సూచన:

తమ పిల్లలు ఫోన్‌లలో ఏమి చూస్తున్నారో పర్యవేక్షించడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తుచేశారు. పిల్లలు మైనర్లు అయినప్పటికీ, వారు చేసే ఇలాంటి సెర్చ్ కార్యకలాపాలకు చట్టపరమైన పరిణామాలు తప్పవని, వారిని శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని యాప్‌లను ఉపయోగించి పిల్లల ఫోన్ కార్యకలాపాలను నియంత్రించవచ్చని, ఇది చాలా ముఖ్యమని తెలిపారు. మీరు మీ ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో లేదా ట్యాబ్‌లో ఇలాంటి విషయాలను సెర్చ్ చేస్తే, మీ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఆధారంగా ఎన్ఐఏ సాంకేతిక పరిజ్ఞానంతో తక్షణమే మీ ఇంటి వద్దకు చేరుకుంటారు. దేశానికి ఉపద్రవం కలిగించే పనులు చేస్తున్నారని భావించినప్పుడు, ఇంటరాగేషన్ సమయంలో మిమ్మల్ని రక్షించడానికి ఏ కోర్టులు కూడా సహాయపడలేవని ఆయన హెచ్చరించారు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా మీ డబ్బు వెనక్కి

Follow Us