AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strawberry Benefits: ఆరోగ్య పరిరక్షణలో ఈ పండ్లు ఎంతో ప్రయోజకరం.. తింటే ‘యూత్‌ఫుల్‌’గా కనిపించడం ఖాయం..!

చర్మ సంరక్షణ మొదలుకుని ఆరోగ్య పరిరక్షణ వరకు కావాలసిన అన్ని రకాల లాభాలను చేకూర్చే గుణాలు స్ట్రాబెర్రీలలో ఉన్నాయి. అందుకే..

Strawberry Benefits: ఆరోగ్య పరిరక్షణలో ఈ పండ్లు ఎంతో ప్రయోజకరం.. తింటే ‘యూత్‌ఫుల్‌’గా కనిపించడం ఖాయం..!
Strawberry Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 27, 2023 | 12:50 PM

Share

మన ఆరోగ్యాన్ని రక్షించడంలో పండ్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. పండ్లలో ఉండే ఈ పోషకాల కారణంగా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక చర్మ సంరక్షణ మొదలుకుని ఆరోగ్య పరిరక్షణ వరకు కావాలసిన అన్ని రకాల లాభాలను చేకూర్చే గుణాలు స్ట్రాబెర్రీలలో ఉన్నాయి. అందుకే స్ట్రాబెర్రీలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బెర్రీలు ఫేస్‌మాస్క్‌లు, స్క్రబ్‌లు, ఫేషియల్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతాయి. స్ట్రాబెర్రీలు తినడానికి రుచికరమైనవే కాకుండా వీటిని క్రమం తప్పకుండా తింటే ఎన్నో రకాల సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి స్ట్రాబెర్రీలను నిత్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. స్ట్రాబెర్రీలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తోంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాన్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పీచు.. జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది.
  2. చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
  3. స్ట్రాబెర్రీస్‌లో ప్రక్షాళన లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై డెడ్ సెల్స్‌ని తొలగించి.. చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మొటిమల నివారణ కోసం మీరు స్ట్రాబెర్రీలను కలిగి ఉన్న ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు.
  4. మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీ స్క్రబ్ ఉపయోగించవచ్చు. అందుకోసం మీరు 5 నుంచి 6 స్ట్రాబెర్రీలను విత్తనాలతో సహా మెత్తగా నలిపి.. దానికి 2 టీ స్పూన్ల తేనె కలపాలి. తర్వాత అందులో కొన్ని చుక్కల వేడినీరు వేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి మసాజ్ చేయండి. మీరు ఈ రెమెడీని వారానికి 3 రోజులు ప్రయోగిస్తే కొన్ని వారాల్లో మీకు మెరిసే చర్మం సొంతమవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ సి.. ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడుతుంది.
  7. క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్‌ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలను కూడా నివారించవచ్చు.
  8. స్ట్రాబెర్రీలు అల్సర్‌ని తగ్గించడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని నిత్యం తీసుకుంటే ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఇన్ని పోషక విలువలు, మంచి గుణాలున్న స్ట్రాబెర్రీలను మీరు కూడా మీ ఆహారంలో ఓ భాగం చేసుకోండి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
  9. స్ట్రాబెర్రీ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీలలోని ఫ్లేవనాయిడ్లు వయస్సుతో పాటు జ్ఞాపకశక్తిని నిరోధిస్తాయి. అలాగే, స్ట్రాబెర్రీలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెదడును ఒత్తిడి లేకుండా ఉంచుతాయి.
  10. స్ట్రాబెర్రీలు మలబద్ధకం నుండి కూడా ఉపశమనం పొందుతాయి. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మలబద్ధకం చికిత్సలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ పాలా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..