- Telugu News Photo Gallery Cricket photos List Of Team India player who won Most Man of the Match Awards For the nation
Man Of The Match Awards: అత్యధికంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు వీరే..
Man Of The Match Awards: భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అయితే 30 పైగా సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఆటగాళ్లు కేవలం 6 మాత్రమే ఉన్నారు. మరి వారెవరో ఓ లుక్కేద్దాం..
Updated on: Feb 27, 2023 | 11:52 AM

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ జట్టు విజయం కోసం పోరాడి ఆటను గెలిపించేవాడే అత్యుత్తమ ఆటగాడు. ఇలా టీమిండియా విజయంలో అద్భుతమైన సహకారం అందించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఇక వీరిలో కొందరు మాత్రమే కనీసం 30 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు.

మరి టీమిండియా తరఫున ఈ ఘనతను 30 కి పైగా సార్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం..

1. సచిన్ టెండూల్కర్: రికార్డులను సృష్టించడానికి పెట్టింది పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. భారత్ తరఫున అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ళ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా తరఫున సచిన్ మొత్తం 664 మ్యాచ్‌లు ఆడగా, 76 సార్లు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెక్కుచెదరని రికార్డు కూడా.

2. విరాట్ కోహ్లి: సచిన్ టెండూల్కర్ తర్వాత టీమిండియా తరఫున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు . భారత్ తరఫున మొత్తం 492 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 62 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

3. సౌరవ్ గంగూలీ: ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. 424 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన గంగూలీ 37 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4. రోహిత్ శర్మ: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున 436 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ కూడా 37 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

5. యువరాజ్ సింగ్: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత్ తరఫున మొత్తం 402 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో అతను 34 మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంకా 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా పొందాడు.

6. వీరేంద్ర సెహ్వాగ్: భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరఫున 374 మ్యాచ్‌లు ఆడిన వీరూ.. 31 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Virat Kohli; Sachin Tendulkar





























