AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదయ్యా.. కన్నీళ్లు ఆగవ్..

అకాల వర్షాలతో పంటలు నష్టపోయి, అప్పుల భారం తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లాలో రైతు తుడుం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటకు గిట్టుబాటు లేక, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్న ఘటన జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది.

Adilabad: అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదయ్యా.. కన్నీళ్లు ఆగవ్..
Farmer Ganapathi
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 5:55 PM

Share

చేతికొచ్చిన పంట అకాల వర్షంతో నీటి పాలైంది. పండించిన పంటకు గిట్టుబాటు రాక కొనే నాదుడు లేక అప్పులను మిగిల్చింది. అయినా ధైర్యం తెచ్చుకుని మరొసారి సాగు చేస్తే ఈ సారి కూడా కాలం కలిసి రాలేదు. చేసిన అప్పు కుప్పలా పెరిగిపోవడంతో ఆదుకునే నాధుడు లేక ఆత్మహత్యనే శరణ్యమంటూ ప్రాణంతీసుకున్నాడు ఓ రైతు. ప్రభుత్వం ఆదుకోకుంటే చావే శరణ్యం అంటూ చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అర్లీ(బీ)కి చెందిన రైతు తుడుం గణపతి (58) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతికి 5.16 ఎకరాల సొంతభూమి ఉంది.. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని 13 ఎకరాల్లో సోయాబీన్‌, పత్తి పంటలు సాగు చేశాడు. వానకాలంలో సోయా, పత్తి, జొన్న పంటలు సాగు చేయగా వర్షం కారణంగా పంట నష్టపోయాడు. ఆరు లక్షలు బయట అప్పు తెచ్చి మరీ పంట సాగు చేయగా తీవ్రంగా నష్టపోయాడు. సోయ పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో పంట తడిచిపోగా కొనుగోలు చేసేందుకు అదికారులు ససేమీరా అన్నారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో మూడు వారాల పాటు పడిగాపులు గాసిన ఫలితం లేకుండా పోయింది. నాణ్యత లేదంటూ మార్కెట్ అదికారులు‌ అభ్యంతరం తెలుపడంతో తన పంటను ఎలాగైనా కొనుగోలు చేయాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని లేకుంటే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని హెచ్చరించాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియా వైరల్‌ అయింది.

ఇంతలోనే మరోసారి అకాల వర్షాలు నిండా ముంచడంతో అన్నంత పని చేశాడు రైతు గణపతి. గురువారం రాత్రి తీవ్ర మనోవేదనకు గురైన గణపతి ఇంట్లో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గణపతి శుక్రవారం మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇప్పుడు గణపతి మృతి తో మరొసారి తెరపైకి వచ్చింది. అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలిసిన జనం.

వీడియో దిగునవ చూడండి… 

Also Read: యాంజియోగ్రామ్ అంటే ఏంటి..? అసలు దీన్ని ఎందుకు చేస్తారు..? ఎలా చేస్తారు..? 

Follow Us