అందాల భామ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది.
మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ 2014 నుండి ఇండస్ట్రీలో చురుగ్గా ఉంటున్నారు.
మొదట్లో మరాఠీ భాషా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. లవ్ సోనియా, జెర్సీ, సూపర్ 30 వంటి చిత్రాలతో నార్త్ లో ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత 2022లో విడుదలైన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమె జీవితంలో పెద్ద మలుపు తిరిగింది.
దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ అమ్మడు హిట్స్ మీద హిట్స్ అందుకుంటుంది.
నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.
అలాగే ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ దగ్గర హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్-బెంజ్ S450 కార్లు ఉన్నాయి.