AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa Bhosle: ఆ నలుగురిపై కేసు పెట్టిన మోనాలిసా

Monalisa Bhosle: ఆ నలుగురిపై కేసు పెట్టిన మోనాలిసా

Phani CH
|

Updated on: May 03, 2026 | 4:01 PM

Share

కుంభమేళా స్టార్ మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సహా నలుగురిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేరళలో పోక్సో కేసు నమోదైంది. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటనలు జరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కోర్టులో వాంగ్మూలం నమోదు చేయగా, కేసు మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

కుంభమేళాలో పూసలమ్ముతూ కనిపించి, తన అందంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రేమ వివాహంతో కుటుంబానికి దూరమైన ఆమె, ఇప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ బాలీవుడ్ దర్శకుడితో పాటు నలుగురిపై సంచలన ఆరోపణలు చేసింది. కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. మోనాలిసా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అయిన అనిల్ విలయిల్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటనలు జరిగాయని మోనాలిసా తన ఫిర్యాదులో తెలిపింది. ఏప్రిల్ 29న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. కొచ్చిలో జరిగిన ఒక సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తనను చాలాసార్లు అసభ్యకరంగా తాకాడ‌ని మోనాలిసా ఆరోపించింది. దర్శకుడు తనను షూటింగ్ సెట్‌లో దాదాపు 10 సార్లు లైంగికంగా వేధించాడని.. అసభ్యంగా తాకాడనీ చెప్పుకొచ్చింది ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు చెబితే, వారు కనీసం పట్టించుకోలేదని తెలిపింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 30న మోనాలిసా కోర్టు ముందు హాజరై తన అధికారిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగినందున, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన మోనాలిసా ఇప్పుడు తరచు వార్తల్లో నిలుస్తోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని హీరోయిన్‌గా మారిన మోనాలిసా.. ఒకవైపు సినిమాల్లోనే నటిస్తూనే.. ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం..వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం..విచారణలో ఆమె మైనర్‌ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు నమోదు అవ్వడం..అంతలోనే ఆమె ప్రెగ్నెంట్‌ అని ప్రకటించడం..ఇలా గత కొద్ది రోజులుగా మోనాలిసా పర్సనల్‌ లైఫ్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో క్యాబ్‌ దోపిడీ.. రూ.200 జర్నీకి రూ.500 వసూల్

బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

Singer Mangli: వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..

విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది

Follow Us