AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్యూటీకి బ్రేకప్ అయ్యిందా.? బాధ నుంచి కోలుకోవడానికి ఏం చేసిందో చెప్పేసిన భామ

ప్రేమలో విఫలమైనప్పుడు ఆ బాధ నుండి బయటపడటం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద సవాలుతో కూడుకున్న విషయమే. దీనికి ఎలాంటి నిర్దిష్టమైన సూత్రాలు లేవు. అయితే తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక యువ కథానాయిక తాను ఎదుర్కొన్న బ్రేకప్ బాధల గురించి, ఆ హార్ట్ బ్రేక్ నుండి ఎలా కోలుకుందో ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది.

ఈ బ్యూటీకి బ్రేకప్ అయ్యిందా.? బాధ నుంచి కోలుకోవడానికి ఏం చేసిందో చెప్పేసిన భామ
Ananya Panday1
Nikhil
|

Updated on: May 03, 2026 | 11:03 PM

Share

యువతలో మంచి క్రేజ్ ఉన్న ఒక స్టార్ కిడ్ తన గత ప్రేమ బంధాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. గతంలో తాను ఎదుటివారి కోసం తనను తాను ఎలా తగ్గించుకుందో చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఒంటరిగా జీవించడం ప్రారంభించిన తర్వాతే తనకు ప్రేమపై ఒక పరిణతి వచ్చినట్లు పేర్కొంది.

హార్ట్ బ్రేక్ నుండి ..

సదరు బాలీవుడ్ నటి ఇటీవల జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ తన హార్ట్ బ్రేక్ అనుభవాలను పంచుకుంది. “ప్రేమలో విఫలమైనప్పుడు నేను బాగా ఏడుస్తాను, ఐస్ క్రీమ్ తింటాను. అరిజిత్ సింగ్ పాడిన విషాదకరమైన పాటలు వింటాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాధను మర్చిపోతాను” అంటూ చాలా సరదాగా సమాధానం ఇచ్చింది. సాధారణ యువతుల తరహాలోనే తాను కూడా బ్రేకప్ బాధను అనుభవిస్తానని తెలిపింది.

అయితే గత బంధాల ద్వారా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, ఆ పాఠాలు ముందే అర్థమై ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. ముఖ్యంగా ఒంటరిగా జీవించడం ప్రారంభించిన తర్వాత తన వ్యక్తిగత స్పేస్‌ను ప్రేమించడం అలవాటు చేసుకున్నానని పేర్కొంది.

నన్ను నేను తగ్గించుకున్నా

గత బంధాలలో తాను చేసిన తప్పుల గురించి చెబుతూ ఒక ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగానికి లోనైంది. “నా గత బంధాలలో నా కంటే ఎదుటివారే ఎక్కువగా వెలగాలని కోరుకునేదాన్ని. అందుకోసం నన్ను నేను తగ్గించుకునేదాన్ని. ఎదుటివారికి నచ్చేలా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. కానీ నన్ను ఎవరూ మార్చలేరనే సత్యాన్ని నేను ముందే గ్రహించి ఉంటే బాగుండేది. బంధాల కోసం మనం ఎప్పుడూ మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు” అని చాలా పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేసింది. తనకంటూ ఒక సొంత స్థలాన్ని ఏర్పరచుకున్న తర్వాతే ప్రేమ మరియు బంధాలపై తనకు సరైన అవగాహన వచ్చిందని వెల్లడించింది.

డేటింగ్ రూమర్స్

ఈ యువ నటి గతంలో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత ఇటీవల కాలంలో వాకర్ బ్లాంకో అనే మాజీ మోడల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేటింగ్ వార్తలపై అటు నటి కానీ, ఇటు మోడల్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఏదేమైనా తన వ్యక్తిగత విషయాలను చాలా నిజాయితీగా పంచుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Follow Us
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం