Gold Prices: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. పండుగల వేళ బిగ్ రిలీఫ్.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
బంగారం, వెండి ధరలపై గుడ్ న్యూస్. ధరలు భారీగా దిగొస్తున్నాయి. పండుగ సమయంలో రోజురోజుకు పతనమవుతూ వస్తోన్నాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లను మరోసారి పెంచనుందనే వార్తలు వస్తన్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు పడిపోతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 15న గురువారం ధరలు ఇలా..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు పతనమవుతూ వస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచే రేట్లు డౌన్ అవుతున్నాయి. పండుగల సీజన్ క్రమంలో చాలామంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు తగ్గుతుండటం కొనుగోలు చేసేవారికి ఊరటగా చెప్పవచ్చు. అమెరికా డాలర్ బలపడుతుండటంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఇదేకాక అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాపై ధరలు తగ్గుదలకు కారణమవుతున్నాయి. అక్టోబర్ 15వ తేదీన గురువారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
బంగారం ధరలు ఇవే..
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,250 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,890గా ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,48,250గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,890 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,250గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,890 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,400 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,040 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,250 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,890 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.
-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,44,900గా ఉంది.
-చెన్నైలో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.
-బెంగళూరులో కిలో సిల్వర్ రేటు రూ.2,34,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.35 లక్షలుగా ఉంది.
