October 14, 2026
Subhash
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులతో లోనవుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన బంగారం ధరలు.. తగ్గుముఖం పడుతున్నాయి.
ముడిచమురు ధరలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
బతుకమ్మ, దసరా పండుగల వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోల్డ్ రేటు వరుసగా తగ్గుతోంది.
కేవలం 3 రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా 3,160 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ఇది కొనుగోలదారులకు గుడ్న్యూస్ అనే చెప్పాలి.
ధర తగ్గిన తర్వాత ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,260 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల ధర 1,35,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే గత కొన్ని రోజులుగా పెద్దగా పరుగులు పెట్టడం లేదు. తాజాగా కిలో వెండి ధర 2,35,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1030 రూపాయలు తగ్గింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 950 రూపాయలు తగ్గింది.
బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే బంగారం కొనే ముందు ఆ రోజు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.