సౌందర్యతో నటించి.. పెళ్లి బట్టలతోనే ఆమె సంతాప సభకు వెళ్లిన హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

14 October 2026

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని హీరోయిన్ రాశి గుర్తు చేసుకున్నారు.

సౌందర్య టీమ్ ఒక సమయంలో "మా మేడమ్‌ను కొట్టేవాళ్లే లేరనుకున్నా, మీ మేడమ్ వచ్చిందే" అని సౌందర్య సిబ్బంది తమ సిబ్బందితో అన్నారని తెలిపారు.

ఈ మాటలను తన సిబ్బంది తనకు చెప్పినప్పుడు, ఎదురెదురు రూమ్స్‌లో ఉన్న తామిద్దరం నిజంగానే పోటీలో ఉన్నామని భావించినట్లు ఆ రాశి తెలిపారు.

సౌందర్య తనకంటే వయసులో చాలా పెద్దది కావడంతో, ఆమె తనను ఒక చిన్నపిల్లలా లేదా చెల్లిలా చూసేదని అన్నారు. తమ మధ్య మంచి స్నేహం, గౌరవం ఉండేదని అన్నారు. 

సౌందర్య మరణ వార్త విన్నప్పుడు తను ఎంతగానో బాధపడ్డానని, ఆ విషాదాన్ని మాటల్లో చెప్పలేనని ఆమె తెలిపారు. తన పెళ్లికి పిలవాలనుకున్న ఒకే ఒక్క వ్యక్తి అని అన్నారు. 

ఆమె అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని వెల్లడించారు. తనకు పెళ్లికూతురిని చేసిన మరుసటి రోజు లేదా ఆ వెంటనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. 

 సౌందర్య అంత్యక్రియలకు బెంగళూరు వెళ్లలేకపోయానని, హైదరాబాద్‌లో సౌందర్య సంతాప సభకు పెళ్లి బట్టలలోనే వెళ్లినట్లు రాశి గుర్తుచేసుకున్నారు.

పెళ్లికూతురిని అయినప్పటికీ సంతాప సభకు వెళ్లి నివాళులర్పించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. సౌందర్యతో తన అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.