- Telugu News Photo Gallery Cricket photos Sachin Tendulkar Son Arjun Tendulkar Dating with Beautiful English Cricketer, Viral Pictures Spark Rumours
Arjun Tendulkar: అర్జున్‌తో డేటింగ్‌లో డేనియల్ వ్యాట్.. సచిన్ కాబోయే కోడలు ఈమేనా?
ఇంగ్లండ్ మహిళల జట్టు ఓపెనర్ డేనియల్ వెయిట్. డేనియల్ భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ముద్దుల కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు డేనియల్ మధ్యలో ఉన్న బంధంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడి మెప్పించింది.
Updated on: Feb 27, 2023 | 3:33 PM

తన ఆటతీరుతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేనియల్ వెయిట్. 2014లో క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది.

ఈ ఇంగ్లీష్ బ్యూటీఫుల్ క్రికెట్ ప్లేయిర్ డేనియల్ ఖుల్లంఖుల్లాలో కోహ్లీకి ప్రపోజ్ చేసింది. అయితే డేనియల్ ప్రతిపాదనపై విరాట్ కోహ్లీ స్పందించలేదు. దీంతో గోల్డెన్ హెయిర్‌తో ఉన్న ఓ బ్రిటన్ క్రికెటర్ చాలా బాధపడింది.

ఆ తర్వాత హఠాత్తుగా గతేడాది అర్జున్ టెండూల్కర్‌తో డేనియల్ కనిపించింది. అర్జున్-డానీల స్నేహం ఈనాటిది కాదు. డేనియల్, అర్జున్ లండన్‌లో కలిసి క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు.

అర్జున్‌తో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుని మరో సారి సోషల్ మీడియాలో మెరిసిపోయింది డేనియల్. అర్జున్‌తో ఇంగ్లీష్ క్రికెటర్ డేటింగ్ చేస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి.

ఈ ఇంగ్లీష్ క్రికెటర్ డానీకి ఉమెన్స్ టీమిండియా జట్టులో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండియాకు వస్తే వీరు చాలా ఫ్రెండ్లీగా భారత్‌ను చుట్టేస్తుంటారు. ఆమెకు వీరంతా ఫ్రెండ్స్ అనేకంటే ఫ్యాన్స్ అంటే బెటర్.

అర్జునుడి కంటే ఈ ఇంగ్లీష్ బ్యూటీ చాలా పెద్దది. ఆటలోనే కాదు అందంలోనూ ఎవరికి తీసిపోదు.

విరాట్ దొరకలేదు. 31 ఏళ్ల డేనియల్ నిజంగా అర్జున్‌ని ప్రేమిస్తోందా..? లేక వారి మధ్య స్నేహం మాత్రమేనా..? ఇది కాలమే నిర్ణయిస్తుందంటున్నారు వారి ఫ్యాన్స్.

ప్రస్తుతం డేనియల్ ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. డేనియల్ ప్రస్తుతం క్రికెట్‌తో 'ప్రేమ'లో ఉందంటున్నారు. పెళ్లి, ప్రేమ గురించి తర్వాత ఆలోచిస్తారని అంటున్నారు.




