Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny video: కోడి పుంజు చెంప పగలకొట్టిన పిల్లి.. ఆసలు వాటి మధ్య ఏం జరిగిందో మీరే చూడండి..

901151,901153,901155,901157

Funny video: కోడి పుంజు చెంప పగలకొట్టిన పిల్లి.. ఆసలు వాటి మధ్య ఏం జరిగిందో మీరే చూడండి..
Cat Slapping Hen
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 02, 2023 | 7:20 AM

ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువుల వీడియోలు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఆ క్రమంలో ఎందరో ఇష్టంగా పెంచుకునే పిల్లుల, కుక్కల వీడియోలను చాలా మంది చూడడానికి ఇష్టపడతారు. అయితే తాజాగా పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే ఒక పిల్లి తన పక్కన ఉన్న కోడి పుంజు చెంప మీద గట్టిగా ఒక్కటి ఇచ్చుకుంది. ఆసలు ఆ రెండు జీవాల మధ్య గొడవ ఎక్కడ మొదలయిందంటే..?

arryadenx అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో మనం చూస్తున్న దృశ్యాల ప్రకారం.. కోళ్ల ఫారమ్‌లోని కోడి పుంజుల మధ్య ఒక పిల్లి పిల్ల ఉంది. దాని మానాన అది కెమెరా వైపు చూస్తుంది. అయితే ఆ పిల్లి పక్కనే ఉన్న కోడి దాని తల మీద పొడిచింది. దీంతో పిల్లికి కోపం తన్నుకొచ్చి.. దాని చెంప పగలకొట్టింది. కొద్ది సెకన్లే ఉన్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అంతేకాక వీడియోను చూసిన నెటిజన్లు బాగా నవ్వేసుకుంటున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడయోను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by Ryd (@arryadenx)

కాగా, ఈ పిల్లి వర్సెస్ కోడి పుంజు వీడియోకు ఇప్పటివరకు దాదాపు 11 కోట్ల 3 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే 4 లక్షల 61వేల లైకులు కూడా అందాయి. ఇంకా ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘అది పిల్లి కాదు.. పులి’ అని రాసుకొచ్చారు. మరో నెటిజన్ అయితే ‘పిల్లులకు గర్వం చాలా ఎక్కువ’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదే క్రమంలో ఇంకో నెటిజన్ ‘ఈ చెంపదెబ్బ వెనుకు పర్సనల్ కారణాలు ఉన్నాయెమో..?’ అంటూ అనుమానపడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..