- Telugu News Photo Gallery Cricket photos Gautam Gambhir, Shahid Afridi and Aaron Finch to Captain Teams in Legends League Cricket 2023
LLC 2023: మళ్లీ బ్యాట్ పట్టనున్న మాజీ క్రికెటర్లు.. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఏ జట్టును ఎవరు నడిపిస్తున్నారంటే..?
ప్రపంచ క్రికెట్‌లోని మాజీ ప్లేయర్లు ఆడే లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నమెంట్ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ అనే మూడు జట్లు పాల్గొనబోతున్నాయి. మరి ఈ జట్లను ఎవరెవరు నడిపించబోతున్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 03, 2023 | 8:15 AM

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నమెంట్ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది. మాజీ ప్లేయర్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ అనే మూడు జట్లు పాల్గొనబోతున్నాయి. ఖతర్ వేదికగా జరిగే ఈ లీగ్‌లోని జట్లను నడిపించేందుకు ఆయా టీమ్‌ల కెప్టెన్ల ఎంపిక కూడా జరిగిపోయింది.

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇండియా మహారాజాస్‌కు నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గంభీర్ మళ్లీ టీ20 లీగ్‌లో కనిపించనుండడం విశేషం.

ఆసియా లయన్స్ జట్టు కెప్టెన్‌గా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో ఆఫ్రిదితో పాటు మహ్మద్ హఫీజ్, తిలకరత్నే దిల్షాన్ కూడా కనిపించనున్నారు.

అలాగే ఈ సారి వరల్డ్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్. ఇటీవలే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఫించ్ ఇప్పుడు లెజెండ్స్ లీగ్ ద్వారా మళ్లీ మైదానంలోకి రానున్నాడు.

అయితే ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మార్చి 10 నుండి మార్చి 20 వరకు ఖతార్‌లోని దోహాలోని ఆసియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ప్రపంచ మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లో కనిపించడం విశేషం.

Legends League Cricket 2023





























