- Telugu News Photo Gallery Cricket photos South Africa vs West Indies joshua da silva has become just the 5th wicketkeeper to claim 7 dismissals in a mens test inning in 44 years
Test Cricket: 44 ఏళ్లలో 5 సార్లు.. టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన 5గురు ప్లేయర్స్.. ఆ ప్రపంచ రికార్డ్ ఏంటంటే?
SA Vs WI: 23 ఏళ్ల తర్వాత అద్భుతమైన ఓ రికార్డ్‌ను సాధించిన రెండో ఆటగాడిగా జాషువా నిలిచాడు. అంతకుముందు 2000 సంవత్సరంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ రిడ్లీ జాకబ్స్ ఈ రికార్డు సృష్టించాడు.
Updated on: Mar 03, 2023 | 8:17 AM

క్రికెట్‌లో ప్రపంచ రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. కానీ, టెస్టు క్రికెట్‌కు సంబంధించిన ఈ ప్రపంచ రికార్డు గత 44 ఏళ్లలో 5 సార్లు నమోదైంది. సెంచూరియన్‌లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్న 24 ఏళ్ల ఆటగాడు ఈసారి ఈ ఘనత సాధించాడు.

చేతిలో గ్లౌజులు ధరించి వికెట్ వెనుక నిలబడి టెస్టు క్రికెట్‌లో భారీ రికార్డు సృష్టించిన వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా డా సిల్వా గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రపంచ రికార్డును సమం చేసిన 5వ ఆటగాడు జాషువా. అదే సమయంలో 23 సంవత్సరాల తర్వాత ఇలా చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2000 సంవత్సరంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ రిడ్లీ జాకబ్స్ ఈ రికార్డు సృష్టించాడు.

జాషువా డా సిల్వా చేత సమమైన ప్రపంచ రికార్డు ఏంటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 7గురిని వికెట్ల వెనుక నుంచి పెవిలియన్ చేర్చిన జాషువా.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. ముందుగా 1979లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌కు చెందిన వసీం బారీ ఈ రికార్డు సృష్టించాడు. ఒక సంవత్సరం తర్వాత 1980లో ఇంగ్లండ్‌కు చెందిన బాబ్ టేలర్ ఈ రికార్డును సమం చేశాడు. 1991లో, న్యూజిలాండ్‌కు చెందిన ఇయాన్ స్మిత్ ఈ ప్రపంచ రికార్డును సమం చేయగా, 2000లో రిడ్లీ జాకబ్స్ టెస్టు ఇన్నింగ్స్‌లో 7గురిని పెవిలియన్ చేర్చాడు.

వికెట్ వెనుక అద్భుతాలు చేసిన జాషువా.. వికెట్ ముందు మాత్రం పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వలం 4 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేశాడు.

వికెట్ కీపింగ్‌లో జాషువా ప్రపంచ రికార్డును సమం చేశాడు. అయితే సెంచూరియన్‌లో వెస్టిండీస్ ఓటమికి వికెట్ ముందు అతని వైఫల్యం కూడా కారణమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెంచూరియన్ టెస్టులో వెస్టిండీస్ 87 పరుగుల తేడాతో ఓడిపోయింది.





























