Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane Juice: ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం అస్సలు తాగకూడదు.. తాగితే లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఎందుకంటే..?

చెరకు రసంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే ఇది అందరికీ మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెరకు రసం తాగడం వల్ల..

Sugarcane Juice: ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం అస్సలు తాగకూడదు.. తాగితే లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఎందుకంటే..?
Sugarcane Juice Side Effects
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 04, 2023 | 8:20 AM

వేసవి ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. అయితే మండుతున్న ఈ వేసవి ఎండలలో కూడా మీ శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచేందుకు చెరుకు రసం తాగడం చాలా మంచిది. చెరకు రసంలో మంచి మొత్తంలో పలు రకాల మినరలస్ ఇంకా మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలు. ఇవి శరీరానికి లభించడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చెరకు రసం అందరికీ మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెరకు రసం తాగడం వల్ల కూడా కొంతమందికి హాని కలుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్, స్థూలకాయం, జలుబు, దగ్గు వంటి పలు రకాల సమస్యలు ఉన్నవారు చెరుకు రసాన్ని అస్సలు తీసుకోకూడదని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏయే సమస్యలతో బాధపడే వ్యక్తులు చెరకు రసాన్ని తీసుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఫుడ్ పాయిజనింగ్: ఫుడ్ పాయిజన్‌తో బాధపడేవారు చెరుకు రసం అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. ఎందుకంటే చెరుకు రసాన్ని ఆరు బయట తయారు చేస్తారు. ఈ సమయంలో ఈగలు, దుమ్ము లాంటివి చెరకు గడలపై ఉంటాయి. ఇది చెరకు రసాన్ని అనారోగ్యకరమైనదిగా చేస్తుంది. అందుకే హాని కలిగించవచ్చు.

తలనొప్పి: చెరకు రసం తలనొప్పిని కూడా ప్రేరేపిస్తుంది. తలనొప్పి సమస్య ఉంటే చెరుకు రసం తాగడం మానుకోండి. ఎందుకంటే చెరుకు రసం తాగడం వల్ల మీ సమస్య మరింత తీవ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

జలుబు-దగ్గు: జలుబు చేసినప్పుడు చెరుకు రసం తాగకూడదు. ఎందుకంటే చెరకు రసం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు సమస్యను మరింత పెంచుతుంది.

ఊబకాయం: అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసం తాగడం మానుకోండి. చెరకు రసం తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. ఇది బరువును మరింత పెంచుతుంది. కాబట్టి ఊబకాయం ఉన్నవారు చెరుకు రసాన్ని తీసుకోకూడదు.

కావిటీస్: మీకు లేదా పిల్లలకి కావిటీస్ సమస్య ఉంటే చెరుకు రసం తాగకూడదు. ఇందులో ఉన్న నేచురల్ షుగర్ దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

గుండె జబ్బులు: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. చెరకు రసం గుండె ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తుంది.

అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. ఇది గుండెకి మరింత హాని కలిగిస్తుంది.

బరువు తగ్గడం: చెరకులో సహజ చక్కెర ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు దీనికి దూరంగా ఉండటం మంచిది. కొంత మంది జిమ్‌కి వెళ్లి బయటకు వచ్చి చెరుకు రసం తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..