- Telugu News Photo Gallery Explore These 8 Best Beaches of South India For A Memorable summer vacation
Best Beaches: సౌత్ ఇండియాలోని టాప్ 8 బెస్ట్ బీచెస్ ఇవే.. మళ్లీ మళ్లీ సందర్శించాలనుకునే అందాలు వీటి సొంతం..
Best beaches: సమ్మర్ వెకేషన్‌కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే దక్షిణ భారతంలోని ఆహ్లాదకరమైన బెస్ట్ బీచెస్ వివరాలివే..
Updated on: Mar 03, 2023 | 9:00 AM

Bekal Beach: కేరళలోని కాసర్ గడ్ జిల్లాలో బేకల్ బీచ్ ఉంది. స్విమ్మింగ్‌కు, సన్ బాతింగ్‌కు ఇది పర్ఫెక్ట్ ప్లేస్. అంతేకాక ఈ బీచ్ దగ్గరలో చాలా బీచ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.

Agonda Beach, Goa: బీచ్ ప్రియులకు దీని గురించి తెలిసే ఉంటుంది. సౌత్ గోవాలోని ఈ బీచ్ వాటర్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. రొమాంటిక్ ట్రిప్ కోసం ఈ బీచ్ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి.

Kudle Beach, Karnataka: ఉత్తర కర్ణాటకలోని కుడలే బీచ్.. దక్షిణ భారత్‌లోని అందమైన బీచ్‌ల్లో ఒకటి.

Mahabalipuram Beach: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం బీచ్ బంగాళాఖాతం అందాలకు నెలవు. ఇక్కడ నెలవై ఉన్న దేవాలయాలు కూడా చాలా ఫేమస్.

Palolem Beach, Goa: గోవాలోని పాలొలెం బీచ్ కూడా చాలా ఫేమస్. ఇది దక్షిణ గోవాలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూడడానికే ప్రత్యేకంగా చాలామంది వస్తుంటారు.

Varkala Beach, Kerala: కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న వర్కల బీచ్ కొత్తగా పెళ్లైన జంటలకు స్పెషల్ డెస్టినేషన్.

Kovalam Beach: కేరళలోని కోవలం బీచ్ దక్షిణ భారత్‌లోని ప్రముఖ బీచ్‌ల్లో ఒకటి. ఇక్కడి నీరు కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది.

Kanyakumari Beach, Tamil Nadu: తమిళనాడులోని కన్యాకుమారి బీచ్ ప్రకతి అందాలకు పెట్టింది పేరు. అరేబియా సముద్ర అందాలను, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి ఇక్కడికి పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు.





























