AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Side Effects: కోడి గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ ఆరోగ్య సమస్యలకు స్వాగతం పలికినట్లే..!

ఆరోగ్య నిపుణులు ప్రతి రోజూ కనీసం ఒక గుడ్డునైనా తినాలని చెబుతుంటారు. అయితే సరిపడిన మోతాదులో మాత్రమే తినాలని.. ఎక్కువుగా తినడం మంచిది కాదని వారే..

Egg Side Effects: కోడి గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ ఆరోగ్య సమస్యలకు స్వాగతం పలికినట్లే..!
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 04, 2023 | 9:00 AM

Share

కోడి గుడ్లు అనేవి పౌష్టికాహారం తీసుకోవాలనుకునేవారికి మొదటి ఎంపికగా ఉంటాయి. ఈ క్రమంలో  కొంత మంది గుడ్లను ఉదయం అల్ఫాహరంగా, సాయంత్రం స్నాక్స్‌గా తింటారు. కోడి గుడ్లను రోజూ తినాలని వైద్య నిపుణులే సూచిస్తున్నారు. అయితే సరిపడిన మోతాదులో మాత్రమే తినాలని.. ఎక్కువుగా తినడం మంచిది కాదని వారే హెచ్చరిస్తున్నారు. కోడి గుడ్లలో ఉండే ఎన్నో రకాల పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. కోడి గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక ఈ గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి రోజూ కనీసం ఒక గుడ్డునైనా తినాలని చెబుతుంటారు. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అంతా బాగానే ఉన్నా.. అసలు రోజుకు ఎన్ని గుడ్లను తినాలి..? ఒకవేళ ఎక్కువ గుడ్లను తింటే ఏమవుతుంది..? ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక రోజులో ఎన్ని గుడ్లు తినాలి..?

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుంది. దీని నుంచి అతని శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే ఇది మన జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు కూడా లేనట్టైతే మూడు గుడ్లను తినొచ్చు. రోజూ రెండుకంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేసే వారై ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుడ్ల నుంచే ఎక్కువగా అందుతాయి.

గుడ్లను ఎక్కువుగా తినడం వల్ల నష్టాలు

అతిసారం: ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడ్లను మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు. దీనివల్ల శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినవద్దని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మలబద్దకం: గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మలబద్దకానికి దారితీస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే కడుపులో చికాకు పుడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ను కూడా ఎదుర్కొంటారు.

కొలెస్ట్రాల్: గుడ్డులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అయితే గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించనప్పటికీ.. ఇది కొవ్వును పెంచుతుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు గుడ్లను తక్కువ మొత్తంలో తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు వరల్డ్ కప్ 2027 రూల్స్ ఛేంజ్
బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు వరల్డ్ కప్ 2027 రూల్స్ ఛేంజ్
కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు..
కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు..
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌
భార్యభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుందో తెలుసా..? చిన్న తప్పుతో
భార్యభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుందో తెలుసా..? చిన్న తప్పుతో
ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడితే.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు..
ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడితే.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు..