AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price In Pakistan: పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న బంగారం ధర.. రేట్ ఎంతో తెలిస్తే ‘ఆ గోల్డ్ మాకొద్దు బాబోయ్’ అనాల్సిందే..

నింగిని అంటుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ప్రభుత్వ నిస్సహాయత మరోవైపు పాకిస్థాన్‌ను మరింత దివాళా దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే..

Gold Price In Pakistan: పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న బంగారం ధర.. రేట్ ఎంతో తెలిస్తే ‘ఆ గోల్డ్ మాకొద్దు బాబోయ్’ అనాల్సిందే..
Gold Price In Pakistan
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 04, 2023 | 6:45 AM

Share

మునుపెన్నడూ లేనంతగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న పాకిస్థాన్‌లో ఏ వస్తువును కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. నింగిని అంటుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ప్రభుత్వ నిస్సహాయత మరోవైపు పాకిస్థాన్‌ను మరింత దివాళా దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లో బంగారం ధరలు పట్టుకుంటే భగ్గుమనేలా ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2.06 లక్షలు (పాకిస్థాన్ కరెన్సీలో) ఉందంటే పాక్ పరిస్థితి ఎంత దిగజారిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా డాలర్‌తో పోల్చితే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే ప్రస్తుతం డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది. పాకిస్థాన్ నెలవారీ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసంలో 31.6 శాతం పెరిగిపోగా.. పాకిస్థాన్ రిజర్వ్ బ్యాంకు 300 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచేసింది. మరోవైపు దేశం దివాళా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో పన్నులు బాగా పెంచేయగా, ధరలు కూడా ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి. ఫలితంగానే పాకిస్థాన్‌లో పాల ధర లీటరుకు ఏకంగా 210 రూపాయలకు చేరింది.

ఇక చికెన్ రేటు విషయానికి వస్తే.. కేజీకి రూ. 700 నుంచి రూ. 780 వరకు ఉంది. అంతేకాకుండా అక్కడ పెట్రోల్ రేటు కూడా రూ. 300కు దాటిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.  మరోవైపు విదేశీ మారకద్రవ్యం తగినంతగా లేకపోవడంతో విదేశీ దిగుమతులు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరి రానున్న కాలంలో పాక్ పరిస్థితి మరింతగా దిగజారుతుందో లేక గాడిన పడుతుందో వేచి చూడాలి.  ఇలా ధరల పెరుగుదల వల్ల ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు