AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hareem Shah’s Video: పాకిస్తానీ ఫేమస్ టిక్‌టాకర్ హరీమ్ షా ప్రైవేట్ వీడియో లీక్.. ఇదీ ఆమె రియాక్షన్..!

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి సోషల్ మీడియా ఫీవర్ పట్టుకుంది. టిక్‌టాక్ వంటి వీడియో షేరింగ్ యాప్స్ ద్వారా.. కనీసం ఇంటి పక్కన వారికి కూడా తెలియనివారు..

Hareem Shah's Video: పాకిస్తానీ ఫేమస్ టిక్‌టాకర్ హరీమ్ షా ప్రైవేట్ వీడియో లీక్.. ఇదీ ఆమె రియాక్షన్..!
Hareem Shah
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2023 | 8:22 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి సోషల్ మీడియా ఫీవర్ పట్టుకుంది. టిక్‌టాక్ వంటి వీడియో షేరింగ్ యాప్స్ ద్వారా.. కనీసం ఇంటి పక్కన వారికి కూడా తెలియనివారు.. రాత్రికి రాత్రే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అయితే, ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ఫేమస్ అవుతున్నారో.. అదే సోషల్ మీడియా వారి కొంపలు ముంచుతోంది. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హరీమ్ షా ప్రైవేట్ వీడియో లీక్ అయ్యింది. తన ప్రియుడితో ఏకాంత సమయంలో ఉన్న వీడియో, స్నానం చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, హరీమ్ షా ప్రైవేట్ వీడియోలను ఆమె స్నేహితులే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. శాండల్ ఖట్టక్, ఆయేషా నాజ్‌లు ఈమె వీడియోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసినట్లు హరీమ్ ప్రకటన విడుదల చేసింది. తన స్నేహితులతో తలెత్తిన విభేదాల కారణంగానే.. వారు ఇలా చేశారని, వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని ప్రకటించింది హరీమ్ షా. ఈ మేరకు ఒక వీడియో ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందే.. తన వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరించారంటూ పేర్కొంది. వారు అన్నంత పని చేశారని వాపోయింది.

వీడియోల లీక్‌పై స్పందించిన హరీమ్ షా భర్త..

హరీమ్ షా భర్త బిలాల్ షా ఈ వీడియోస్ లీక్ అంశంపై స్పందించాడు. తీవ్ర ఆగ్రహానికి, నిరాశకు లోనైనట్లు చెప్పాడు. ‘నా దృష్టిలో వారు చాలా నీచమైన పని చేశారు. ప్రస్తుతం మేము ఔటాఫ్ కంట్రీలో ఉన్నాం. పాకిస్తాన్‌కి తిరిగి వెళ్లాక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. వారి మాటలను నేను పట్టించుకోను. ఇలాంటి సమయంలో నా భార్యను నేను వదిలిపెట్టలేను. అలా చేస్తే ఆమెకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. అల్లా కు మాత్రమే నేను జవాబుదారీని. ఈ విపత్కర సమయంలో నా భార్యకు నేను అండగా ఉంటాను’ అని వీడియోలో తెలిపాడు బిలాల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..