Trending Video: తనలోని దయాహృదయాన్ని చాటిన చిన్నారి.. ‘లిటిల్ హీరో’ అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే..?
చిన్న పిల్లల మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. అందులో అసూయ లేదా క్రూరత్వానికి స్థానం ఏ మాత్రం ఉండదు. అసలు ఆ చిన్నారి బాలుడు ఏం చేశాడంటే..
కాకిని పట్టుకుంటే.. లేదా పొరపాటున అది మనల్ని తాకినా అశుభం అని భావించేవారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అయితే కాకుల వల్ల అశుభం జరుగుతుందనే విషయం నిజమో కాదో తెలియదు కానీ ఏ మూగ జీవం ప్రాణపాయ స్థితిలో ఉన్నా కాపాడడం మన కనీస ధర్మం. అదే పనిని చేసి చూపాడు ఓ చిన్నారి బాలుడు. దీంతో అతను ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా నిలిచాడు. సాధారణంగానే చిన్న పిల్లల మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. అందులో అసూయ లేదా క్రూరత్వానికి స్థానం ఏ మాత్రం ఉండదు. అసలు ఆ చిన్నారి బాలుడు ఏం చేశాడంటే.. స్కూల్ ఆవరణలోని ఫెన్సింగ్ వలలో ఒక కాకి చిక్కుకుని ఇబ్బంది పడుతోంది. అది చూసిన బాలుడు ఆ కాకిని వల నుంచి తప్పించి గాలిలోకి వదిలేశాడు.
అయితే దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఒక దయాహృదయం లెక్కలేనన్ని జీవితాలను తాకుతుంది’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో.. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఒక బాలుడు వలలో చిక్కుకుని ఉన్న కాకిని కాపాడడాన్ని మనం చూడవచ్చు. ఈ క్రమంలో అతని స్నేహితులు కూడా అక్కడే ఉండి.. ఆ బాలుడు చేసే మంచి పనిని ప్రోత్సాహించారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
A compassionate heart touches countless lives.❤️? pic.twitter.com/93XKNckU0n
— Sabita Chanda (@itsmesabita) March 1, 2023
కాగా, Sabita Chanda అనే ట్విటర్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ బాలుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది లైక్ చేశారు. అలాగే ఇప్పటివరకు 90 వేల వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ ఆ బాలుడి కోసం కోరుకున్నాడు. మరో నెటిజన్ ‘చిన్నపిల్లల్లో దేవుడు ఉంటాడు. ఆశ్చర్యమేమిటంటే వాళ్లు పెద్దవారిగా ఎదిగినప్పుడు వారిలోని దేవుడు కూడా దయ్యంలా మారిపోతాడు’ అని అభిప్రాయపడ్డాడు. ఇంకా పలువురు ‘లిటిల్ హీరో’ అంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..